30.7 C
Hyderabad
April 19, 2024 07: 15 AM
Slider తెలంగాణ

బిర్యానీలో వెంట్రుకలు వచ్చినందుకు లక్ష జరిమానా

pjimage (21)

బిర్యానీలో వెంట్రుకలు వచ్చినందుకు సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్ కు వెళ్లిన ఒక కష్టమర్ కు బిర్యానిలో వెంట్రుకలు కనిపించాయి. దాంతో అతను ఫిర్యాదు చేశాడు. కష్టమర్ ఫిర్యాదుతో జిహెచ్ ఎంసి హెల్త్ అధికారి, ఫుడ్ ఇన్ స్పెక్టర్, శానిటేషన్ అధికారి రంగంలో దిగారు. ప్యారడైజ్ హోటల్ లో పరిశుభ్రత ఏ స్థాయిలో ఉందో పరిశీలించారు. అక్కడ వంటసామాగ్రిలో, పరిస్థితులలో పరిశుభ్రత లేకపోవడాన్ని గమనించారు. బిర్యానీ లో నాణ్యతను కూడా పరిశీలించారు. అవన్నీ సరైన ప్రమాణాలలో లేకపోవడంతో జిహెచ్ ఎంసి అధికారులు లక్ష రూపాయల జరిమానా విధించారు. పక్కనే ఉన్న కేప్ బహార్ ను కూడా పరిశీలించిన జీహచ్ ఎంసి అధికారులు ఆ హోటల్ పరిస్థితులు కూడా సరిగా లేకపోవడంతో లక్ష రూపాయల జరిమానా విధించారు. అంతే కాకుండా కేప్ బహార్ ట్రేడ్ లైసెన్సు లేకుండా నడుపుతున్నారని గమనించిన అధికారులు భారీ పెనాల్టీ విధించారు. కేప్ బహార్ కు ప్యారడైజ్ హోటల్ కు జరిమానా విధించడమే కాకుండా పరిస్థితులు మార్చాలని సూచిస్తూ నోటీస్ కూడా ఇచ్చారు. వారం రోజులలో సరిచేసుకోకపోతే హోటల్ కు తాళం వేస్తామని అధికారులు హెచ్చరించారు.

Related posts

బాదుడే బాదుడు: ఏపీలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు

Satyam NEWS

విఆర్ఏ పోస్టుల సర్దుబాటు పై స్టే

Bhavani

మతి స్థిమితం లేని యువతిపై ఆసుపత్రిలో అత్యాచారం

Satyam NEWS

Leave a Comment