28.7 C
Hyderabad
April 20, 2024 04: 32 AM
Slider హైదరాబాద్

గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేటర్స్ స్పోర్ట్స్ మీట్

#ghmc

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా కార్పోరేటర్స్ స్పోర్ట్స్ మీట్ 2023 క్రీడా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచినటువంటి వారికి చదర్ గాట్ లోని విక్టోరియా ఆడిటోరియంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో అంబర్ పెట్ కార్పొరేటర్ ఇ.విజయ్ కుమార్ గౌడ్  క్రికెట్ మ్యాచ్ లో టీం కెప్టెన్ గా విజయం సాధించినందుకు  ప్రథమ బహుమతి అందుకోగా, విజయ్ కుమార్ గౌడ్ కెప్టెన్సీలో కబడ్డీ జట్టు విజయం సాధించగా ప్రథమ బహుమతి అందుకోవడం జరిగింది, అలాగే చెస్ పోటీల్లో రన్నరప్ గా నిలిచినందుకు ద్వితీయ బహుమతి అందుకున్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలు తోటి కార్పొరేటర్లతో సహృద్భావ వాతావరణము కల్పించి వారితో ఆడి విజయం సాధించినందుకు ఆనందంగ వుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి అధికారులు,కార్పొరేటర్లు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

చర్యలు తీసుకోవడం మాట దేవుడెరుగు… ఆధారాలే గాయబ్

Satyam NEWS

బ్రుటల్:పెళ్ళైపిల్లలు ఉన్నాయువతిఫై పెట్రోల్ పోసి నిప్పు

Satyam NEWS

చెట్లు నరికితే క్రిమినల్ కేసులు

Murali Krishna

Leave a Comment