27.7 C
Hyderabad
April 25, 2024 10: 05 AM
Slider ఆదిలాబాద్

పెద్ద ఎత్తున నిషేధిత పొగాకు ఉత్పత్తుల పట్టివేత

#ProhibitedGhutka

కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నిషేధిత పొగాకు ఉత్పత్తులను పెద్దఎత్తున పట్టుకున్నారు.

రామగుండం  కమిషనర్, కుమురం భీం జిల్లా ఇంచార్జ్ ఎస్పీ వి.సత్యనారాయణ, అడిషనల్ ఎస్పీ సుధీంద్ర ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్సు పోలీసులు ఆసిఫాబాద్ పట్టణం లో తనిఖీలు నిర్వహించారు.

సందీప్ నగర్ లోని ఒక ఇంట్లో తనిఖీలు నిర్వహించగా కుందడ ప్రశాంత్, సాభీర్ అనే ఇద్దరు వ్యక్తుల వద్ద నుంచి అక్రమంగా నిలువ ఉంచిన 86,310 రూపాయల విలువగల నిషేధిత పొగాకు ఉత్పత్తులను కనుగొని స్వాధీనం చేసుకున్నారు.

వీటిలో పూల్ చాప్ ప్యాకెట్లు, అంబార్ ప్యాకెట్లు ఉన్నాయి. వాటిని టాస్క్ ఫోర్సు పోలీసులు కేసు తదుపరి దర్యాప్తు కోసం ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు.

ఈ దాడుల్లో టాస్క్ ఫోర్సు సీఐ రాణా ప్రతాప్, ఎస్ఐ.హరి శేఖర్, కానిస్టేబుల్ సంజివ్ పాల్గొన్నారు.

Related posts

కౌన్సిల్ తీర్మానానికి వ్యతిరేకంగా కన్సల్టెన్సీ ప్రతిపాదన

Satyam NEWS

మంత్రిని దూషించిన బిజెపి నేతపై ఫిర్యాదు

Satyam NEWS

238 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు

Bhavani

Leave a Comment