35.2 C
Hyderabad
April 20, 2024 18: 31 PM
Slider నిజామాబాద్

గుట్కా కావాలా? నో ప్రాబ్లం ఈ గాడిదలు తెచ్చిస్తాయి

Donkeys

బిచ్కుంద జుక్కల్ మండలం  కర్నాటక మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంగా ఉంది. దీంతో పలు నిషేధిత గుట్కాలు పొగాకు ఉత్పత్తులు ఈ ప్రాంతం గుండా అక్రమంగా రవాణా చేయడానికి సులువుగా ఉంది .దీనికి తోడు కరోనా మహమ్మారి బారి నుండి తమ ప్రజలను కాపాడుకోవడానికి కేంద్ర రాష్ట్ర  ప్రభుత్వం  లాక్డౌన్ విధించడంతో పోలీసు అధికారులంతా ప్రజలను రోడ్డుపైకి రాకుండా ఎక్కడికక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు.

ఇదే అదునుగా భావించిన కొందరు గుట్కా పొగాకు వ్యాపారం చేసే నిర్వాహకులు తమ ద్విచక్ర వాహనాల ద్వారా కార్ల ద్వారా చివరికి గాడిదల పైన కూడా ఈ  ఈ నిషేధిత ఉత్పత్తులను రవాణా చేస్తున్నారంటే వీరి ధైర్యం ఎంతమేర కుందో స్పష్టమవుతున్నది .ద్విచక్ర వాహనదారులు నంబర్లు లేని బైకులపై, కార్లలో నిత్యావసర సరుకుల  రవాణా అని ప్రభుత్వ అనుమతి పత్రాలతో కూడా ఈ గుట్కాలు సరిహద్దు దాటుతున్నాయి.

పెద్ద మొత్తంలో గుట్కా కర్నాటక నుండి వస్తున్న దన్నది అందరికీ తెలిసిందే. కానీ అది ఎక్కడికి చేరుకుంటుంది అని పట్టుబడిన వారిని అప్పటి అధికారులు విచారిస్తే  అందరూ చెప్పేది పేరు బిచ్కుంద. అటు అధికారులు విధుల్లో నిమగ్నం కావడంతో బిచ్కుందకు చెందిన కొంత మంది బడా వ్యాపారులకు  ఈ వ్యవహారం కలిసొచ్చినట్లయింది.బైకులు పోయాయి కార్లు పోయాయి చివరికి గాడిదలు కూడా వీరికి పనికి వస్తున్నాయంటే వీరి ఆలోచన ఏ మేర కుందో అర్థమవుతున్నది.

గతంలో ఒక్క గుట్కా ప్యాకెట్ 150రూపాయలకు అముతుండగా ఇప్పుడు 500రూపాయలకు అమ్ముతున్నారని చిల్లర కొట్టు యజమానులు వాపోతున్నారు. మరో పొగాకు ఉత్పత్తి సూర్య చాప్  గతంలో నూట యాభై రూపాయలు అమ్మితే ఇప్పుడు 1000రూపాయల వరకు అమ్ముతున్నారని వారు వాపోతున్నారు.

పొగాకు నమలడం ఆరోగ్యానికి హానికరం క్యాన్సర్కు కారకం అంటూ ప్రత్యేక ప్రకటనలు ప్రభుత్వ ప్రకటనలు చేసి తెలంగాణ రాష్ట్రంలో వాటిని నిషేధించాయి కూడా కానీ వ్యాపారులు మాత్రం వాటిని ఏదో ఒక విధంగా సరిహద్దు ప్రాంతాల నుండి తీసుకువచ్చి ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని వాటిని అమ్ముకుంటూ వీరు సొమ్ము చేసుకుంటున్నారు.

నిన్న జుక్కల్ మండలంలోని గుండూర్ గ్రామంలో అయిదు గాడిదల పైన సోయా పొట్టు నింపి అందులో గుట్కా పాకెట్లను తరలించడం తో జుక్కల్ పోలీసు అధికారులు పట్టుకున్నారు దీంతో విషయం మరోసారి తెరపైకొచ్చింది దీనిపై సంబంధిత అధికారులు స్పందించి మండల కేంద్రంలోని పెద్ద పెద్ద షాపుల్లో గోదాముల్లో తనిఖీలు చేపడితే గాని వీరి వ్యాపారం అడ్డుపడేలా లేదని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు.

Related posts

గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

Satyam NEWS

ఆధ్యాత్మిక చింతనతోనే ప్రశాంత జీవనం

Satyam NEWS

స్కాములతో రాష్ట్రాన్ని అభాసు పాలు చేస్తున్న బీ ఆర్ ఎస్

Satyam NEWS

Leave a Comment