39.2 C
Hyderabad
April 25, 2024 15: 09 PM
Slider సినిమా

సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ ధీరజ అప్పాజీకి గిడుగు రామ్మూర్తి పురస్కారం

#dhirajaappaji

సినిమా జర్నలిజంలో చేస్తున్న కృషికి గాను సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ – పి.ఆర్.ఓ – “స్వాతిముత్యం” సంపాదకుడు ధీరజ అప్పాజీని ప్రతిష్టాత్మక గిడుగు రామ్మూర్తి పంతులు పురస్కారం వరించింది. “వాడుక భాషా ఉద్యమ  పితామహుడు” గిడుగు రామ్మూర్తి పంతులు 83వ వర్ధంతిని పురస్కరించుకుని… “శంకరం వేదిక”తో కలిసి గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ నిర్వహించిన వేడుకలో అప్పాజీ ఈ పురస్కారం అందుకున్నారు. తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి జస్టిస్ డా.జి.రాధారాణి ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి తెలంగాణ బి.సి.కమిషన్ చైర్మన్ వకులాభరణం కృష్ణమోహన్ రావు, ఇన్కమ్ టాక్స్ కమిషనర్ జీవన్ లాల్ విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహిత్య – కళ – సేవా రంగాల్లో గుర్తింపు తెచ్చుకున్న పలువురికి ఈ పురస్కారాలు ప్రదానం చేశారు. హైదరాబాద్, సుందరయ్య విజ్ఞానకేంద్రంలో శనివారం సాయంత్రం అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ అధ్యక్షురాలు మరియు గిడుగు రామ్మూర్తి పంతులు వారసురాలు “శ్రీమతి గిడుగు కాంతికృష్ణ”, ఈ సంస్థ ప్రధాన కార్యదర్శి మరియు ప్రముఖ పాత్రికేయులు – కవి – కళారత్న డా.బిక్కిన కృష్ణ, “శంకరం వేదిక” అధ్యక్షురాలు శ్రీమతి యలవర్తి ధనలక్ష్మి, సుమన్ టివి సినిమా విభాగం క్రియేటివ్ హెడ్ ప్రభు, శతాధిక చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాలుపంచుకున్నారు.

Related posts

కరవు పనులపై సోషల్ ఆడిట్

Satyam NEWS

కొత్త సినిమా విడుదల రోజే ఫస్ట్ డే ఫస్ట్ షో ఇంట్లోనే నేరుగా చూసే అవకాశం

Bhavani

అపర తిరుపతి మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయం లో ప్రత్యేక పూజలు

Bhavani

Leave a Comment