పోటీపరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థిని ఆత్మహత్య ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అశోక్ నగర్ లో సాయి ప్రభ గర్ల్స్ సూపర్ లగ్జరీ హాస్టల్ లో ఫ్యాన్ కి చున్నీతో ఉరి వేసుకొని రేణుక నాయక్ (24) అనే విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. పక్కరూమ్ లో ఉన్న స్నేహితురాలు గమనించి సిబ్బందితో కలిసి కిందకు దించి.. కొన ఊపిరితో ఉన్న ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కామారెడ్డి జిల్లా సోమారం గ్రామానికి చెందిన రేణుక కు గత నెలలో ఎంగ్గేజ్మెంట్ అయింది…ఫిబ్రవరి 7న పెళ్లి ఫిక్స్ అయింది.
previous post
next post