35.2 C
Hyderabad
April 24, 2024 14: 51 PM
Slider తూర్పుగోదావరి

ప్రేమించి మోసపోయిన యువతి ఆత్మహత్యాయత్నం

#lovefailure

ప్రేమించుకున్నారు… పెళ్లి చేసుకుందామనుకున్నారు…. అయినా పిల్లాడు మొహం చాటేశాడు. ఏం చేయాలో తెలియని యువతి ఆత్మహత్యాయత్నం చేసుకుంది.

ఈ దుర్ఘటన తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో జరిగింది.

చింతలూరు గ్రామానికి చెందిన యువతి అదే గ్రామానికి  చెందిన నేలపూడి సత్య నరేష్ అనే యువకుడు ప్రేమించింది.

యువకుడూ ప్రేమించినట్లు చెప్పాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడం తో ఆ యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంది.

స్థానిక ఆలమూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా అమ్మాయి పరిస్థితి విషమంగా ఉండడంతో కాకినాడ జిజిహెచ్ ఆసుపత్రికి కి తరలించారు.

ఆ యువతికి ఎక్కువగా ఫిట్స్ రావడంతో 12 గంటలు గడిస్తే గాని అమ్మాయి పరిస్థితి చెప్పలేమని డాక్టర్లు తెలిపారని యువతి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తంచేశారు.

పెద్దల ఎదుట ఒప్పందం జరిగినా కూడా యువకుడు పెళ్లికి అంగీకరించడం లేదని తల్లి వెల్లడించింది.

Related posts

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లును వెంటనే పేదలకు పంచాలి

Satyam NEWS

విజయనగరం సెంట్రల్ అధ్వర్యం లో క‌బ‌డ్డీ పోటీలు….!

Satyam NEWS

గాంధీ నగర్ లక్ష్మీ గణపతి ఆలయానికిఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

Satyam NEWS

Leave a Comment