కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని బాలికల కళాశాల హాస్టల్ భవనం కు ఓ విద్యుత్తు స్తంభం హాస్టల్ భవనం లోపలి నుండి ఆనుకుని ఉంది. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం సంభవించినా హాస్టళ్లకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఈ భవన నిర్మాణ సమయంలో యాజమాని విద్యుత్ శాఖ అధికారుల ఆదేశాలు పాటించకుండా నిర్మాణం చేపట్టారు.
దీంతో రోడ్డుపైన ఉన్న స్తంభాన్ని తన భవనంలో కలిపి నిర్మించడం అయిన నిర్లక్ష్యానికి పరాకాష్టగా మారింది. కానీ ఇప్పుడు ఆ భవనం బాలికల హాస్టల్ కు అద్దెకు ఇవ్వడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరిగిన నష్టపోయేది విద్యార్థినులే కావున విద్యుత్ శాఖ అధికారులు స్పందించి హాస్టల్ కు ఆనుకుని ఉన్న స్తంభం నుండి వైర్లను వేరుచేసి మరో స్తంభాన్ని ఏర్పాటు చేసి ప్రమాదం జరగకుండా చూడాలని విద్యార్థుల తల్లిదండ్రులు స్థానికులు కోరుతున్నారు.