32.2 C
Hyderabad
March 29, 2024 01: 12 AM
Slider మహబూబ్ నగర్

చదువుల తల్లి సావిత్రి బాయి పూలేకు భారతరత్న ఇవ్వాలి

#BCStudents

బిసి విద్యార్థి సంఘం వనపర్తి జిల్లా అధ్యక్షుడు కురుమూర్తి ఆధ్వర్యంలో సావిత్రి బాయి పూలే జయంతి ఘనంగా నిర్వహించారు. మహిళ హక్కుల కోసం పోరాడిన సావిత్రి బాయి పూలే సమస్య ఎదురైనప్పుడు చెక్కుచెదరని దీరత్వం అదేవిధంగా కళ్ల ముందు విలవిల్లాడే జనానికి  పట్టెడన్నం పెట్టిన మానవత్వం ఆమె సొంతం అని వనపర్తి జిల్లా బిసి విద్యార్థి సంఘం అధ్యక్షుడు కురుమూర్తి అన్నారు.

సమాజం బాగుపడాలి అన్న తపనతో సాంఘిక దురాచారాలు అసమానతలపై పోరాడి ఎన్నో పద్మవ్యూహలు చేదించి గెలిచిన వీర వనిత ధ్రువతార సావిత్రిబాయి పూలే అని అన్నారు. భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే 9సంవత్సరాలకి బాల్య వివాహం చేసారని, ఆమె బాల్య వివాహం ఆనాటి పరిస్థితులకు అద్దం పడుతుందన్నారు.

కాబట్టి తన భర్తను ఆదర్శంగా తీసుకుని వంటింటికే పరిమితం కాకుండా చదువు నేర్చుకున్నారని తెలిపారు. తనకు యుక్తవయసు వచ్చేసరికి అనగా 18 సంవత్సరాలలో దేశంలో మొదటి ఉపాధ్యాయురాలుగా పని చేసారని చెప్పారు. ఆమె పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నప్పుడు ఆమెకు ఎన్నో అవమానాలను ఎదుర్కోవడం జరిగిందన్నారు.

పాఠశాలకు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు ఆమెపై పేడ బురద , రాళ్లతో కొట్టారని,అయినా కానీ అజ్ఞానమే తనకు శత్రువు అని ప్రతి ఒక్కరూ కనీస జ్ఞానం పొందాలనే తపనతో 1848 జనవరి 1వ తేదీన పూణేలో మొట్టమొదటి మహిళా పాఠశాలను ఏర్పాటు చేశారని తెలిపారు.

అదే విధంగా (మహిళ సేవ మండల్) అనే సంఘాన్ని ఏర్పాటు చేసి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాటటం జరిగిందని చెప్పారు.పూణేలోని యూనివర్సిటీకి సావిత్రి బాయి పూలే పేరు పెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మధుకుమార్ యాదవ్, అంజి, విజయ్, వినోద్, కార్తిక్, మూర్తి, యాదగిరి,సాయి చరణ్, సాయి కృష్ణ గౌడ్ పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

హుజుర్ నగర్ మున్సిపాలిటీ లో అభివృద్ధి పనులకు శంఖుస్థాపన

Satyam NEWS

సీక్రెట్: ఏపిలో బిజెపి దూకుతుందా? దూకదా?

Satyam NEWS

జస్ట్ ఫర్ చేంజ్ :మోదీ ఇలాఖాలో ఎన్ఎస్‌యూఐ ఘన విజయం

Satyam NEWS

Leave a Comment