36.2 C
Hyderabad
April 25, 2024 22: 01 PM
Slider నల్గొండ

రైస్ మిల్లు కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించాలి

#Hujurnagar

రైస్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న కార్మికులందరికీ కరోనా పరీక్షలు చేయాలని,ఇప్పటికే కొంత మంది కార్మికులకు కరోనా సోకిందని, మిగిలిన కార్మికులు అందోళనలో ఉన్నారని, వారికి 15 రోజులు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించాలని జిల్లా CITU ఉపాధ్యక్షుడు శీతల రోషపతి అన్నారు. ఈనెల 20వ, తేదీ నుండి జూన్ 4 తేదీ వరకు పనులు పూర్తిగా బందు చేయుటకు కార్మికులు సిద్ధంగా ఉన్నారని,TRSKV నియోజకవర్గ అధ్యక్షుడు పచ్చిపాల ఉపేందర్,INTUC నియోజకవర్గ అద్యక్షుడు బెల్లంకొండ గురవయ్యలతో కలిసి ఆయన అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని సి ఐ టి యు, టి ఆర్ ఎస్ కె వి, ఐ ఎన్ టి యు సి సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈనెల 20వ, తేదీన బందు చేయాలని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు

లక్ష్మీనరసింహ రావు కి నోటీసు అందజేసిన అనంతరం సంఘ నాయకులు మాట్లాడారు. హుజూర్ నగర్ లోని ప్రభుత్వ అధికారులు ఆర్ డి ఓ వెంకారెడ్డి, తహసీల్దార్ జయశ్రీ,సి ఐ రాఘవరావు, ఎస్సై వెంకటరెడ్డి కి విడివిడిగా కార్మికులు బందు వినతి పత్ర సమాచారం అందించామని అన్నారు.

రైస్ మిల్ యాజమాన్యం వేతనంతో కూడిన సెలవుపై చర్య తీసుకోవాలని,ఈ లోగా కార్మికులందరికీ కరోనా పరీక్షలు చేయించాలని, ప్రతి ఒక్కరికి భీమా సౌకర్యం కల్పించాలని,ఇప్పటికే కరోనా బాధలో ఉన్న వారికి ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సి ఐ టి యు నాయకులు కోటేశ్వరరావు, చింతకాయల పర్వతాలు, కె.వెంకన్న, ఎల్లప్ప, రామయ్య, కనకయ్య,TRSKV నాయకులు తమ్మిశెట్టి వెంకన్న ,చింతకాయల మల్లయ్య, సైదులు,INTUC నాయకులు సలిగంటి జానయ్య, శ్రీను,నాగరాజు, కొండలు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

హుజూర్ నగర్ లో కదం తొక్కిన ఐ ఎన్ టి యు సి కార్మికులు

Satyam NEWS

కనీస సౌకర్యాలు లేకుండా కుటుంబ నియంత్రణ క్యాంపు పెడితే ఎలా?

Satyam NEWS

బీజేపీ జెండా కూల్చిన వారిపై చర్యలకు డిమాండ్

Bhavani

Leave a Comment