27.7 C
Hyderabad
April 26, 2024 04: 26 AM
Slider విశాఖపట్నం

గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో 13 లక్షల కోట్ల పెట్టుబడులు

#jagan

విశాఖలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పెట్టుబడుల వర్షం కురిసింది. గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు 340 సంస్థలు ముందుకొచ్చాయని సీఎం జగన్ తెలిపారు. 20 సెక్టార్లలో రాష్ట్రానికి 13 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని సమ్మిట్లో చెప్పారు. 6 లక్షల మందికిపైగా ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయన్నారు.

సమ్మిట్ తొలిరోజు 11, 87, 756 కోట్ల మొత్తంతో 92 ఎంవోయూలు చేసుకున్నట్టు సీఎం వెల్లడించారు. దీని ద్వారా దాదాపు 4 లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. మిగిలిన 248 ఎంవోయూలను రెండో రోజు సదస్సులో కుదుర్చుంటామన్నారు. రెండో రోజు స‌మ్మిట్‌లో  1.15 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకోబోతున్నామని, దీని ద్వారా మరో 2 లక్షల మందికి పైగా ఉపాధి లభిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాన పెట్టుబడిదారులలో నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC)  2,35,000 కోట్ల పెట్టుబడితో 77,000 మందికి ఉపాధి కల్పించే 3 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. 

ఏబీసీ లిమిటెడ్ 1.2 లక్షల కోట్ల పెట్టుబడితో ఎంఓయూపై సంతకం చేసి ఆంధ్రప్రదేశ్‌లోని 7000 మందికి ఉపాధి కల్పించబోతోంది.  జేఎస్డబ్య్లూ గ్రూప్ 6 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది.   50,632 కోట్ల పెట్టుబడితో 9,500 మందికి ఉపాధిని కల్పించనుంది. అదానీ గ్రీన్ ఎనర్జీ  21,820 కోట్ల పెట్టుబడితో 14,000 మందికి ఉపాధి కల్పించే 2 అవగాహన ఒప్పందాలు చేసుకుంది. అరబిందో గ్రూప్ 10,365 కోట్ల పెట్టుబడితో 5 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది, దీని ద్వారా 5,250 మందికి ఉపాధి ఇవ్వనుంది. ఆదిత్య బిర్లా గ్రూప్ 2,850 మందికి ఉపాధి కల్పించే 9,300 కోట్ల పెట్టుబడితో 2 అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. జిందాల్ స్టీల్ 7,500 కోట్ల పెట్టుబడితో 2,500 మందికి ఉపాధి కల్పించే ఎంఓయూపై సంతకం చేసింది. మొదటి రోజు మొత్తం 64 కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం నిజంగా రికార్డని చెప్పొచ్చు.

ముఖేష్‌ అంబానీ, కుమార మంగళం బిర్లా, కరణ్‌ అదానీ, సంజీవ్‌ బజాజ్, అర్జున్‌ ఒబెరాయ్, సజ్జన్‌ జిందాల్, నవీన్‌ జిందాల్, మార్టిన్‌ ఎబర్‌ హార్డ్డ్, హరిమోహన్‌ బంగూర్, సజ్జన్‌ భజాంకా వంటి 30కి పైగా కార్పొరేట్‌ దిగ్గజ ప్రముఖులు సదస్సులో పాల్గొన్నారు. ఆంధ్రా యూనివర్శిటీలోని సువిశాలమైన గ్రౌండ్లో సుమారు 200 స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఇందులో 30 స్టాల్స్‌తో సహా ప్రభుత్వం గుర్తించిన 13 కీలక రంగాలలో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడం వల్ల కలిగే వివిధ ప్రయోజనాలను ప్రదర్శిస్తారు. భారత్, చైనా, యూఎస్ ఏ సహా 40 ఇతర దేశాల నుండి 8,000 మంది ప్రముఖులు మరియు పెట్టుబడిదారులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.

Related posts

జయ జయ సాయి ట్రస్ట్ వారి క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడతాం

Satyam NEWS

హైకోర్టులో మరో మారు జగన్ ప్రభుత్వానికి ఆశాభంగం

Satyam NEWS

Leave a Comment