37.2 C
Hyderabad
March 29, 2024 20: 01 PM
Slider మహబూబ్ నగర్

మాస్కులు, గ్లౌజులు తప్పని సరిగా ధరించాలి

Venkatreddy CI

వ్యాపారస్తులు, సేవా కార్యక్రమాలు చేసేవారు తప్పని సరిగా నోటికి ముక్కుకు మాస్కు, చేతి గ్లౌజ్ లు వాడాలని కొల్లాపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి కోరారు. కొల్లాపూర్ లో క్లాస్ మెట్ క్లబ్ ఏర్పాటు చేసిన కరోనా అవగాహన కార్యక్రమంలో నేడు ఆయన పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో వ్యాపారస్తులు, వాణిజ్య సంస్థలు, సేవాసంస్థల సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కొల్లాపూర్ సి ఐ వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కరోనా కట్టడిలో భాగంగా అందరూ తప్పని సరిగా చేతి తొడుగులు వాడాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.

రెండవ దశ నుండి మూడవ దశకు వ్యాపిస్తున్న వ్యాధి లక్షణాలను మదిలో ఉంచుకుని ప్రతీ కిరణదారుడు, వ్యాపారస్తులు, సేవా కార్యక్రమాలు చేస్తున్నవారు తప్పని సరిగా చేతి తొడుగులు వాడకపోతే వినియోగదారుల నుండి వ్యాపారస్తులకు, వ్యాపారస్తులు నుండి వినియోగదారులకు కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు.

క్లబ్ సభ్యులు నిత్యావసర సరుకుల దుకాణాలు, పండ్ల వ్యాపారులు, చికెన్ షాప్, కొబ్బరి బొండాల షాప్ నిర్వాహకులకు  చేతి గ్లౌస్ లు ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమంలో కొల్లాపూర్ సబ్ ఇన్స్పెక్టర్ మురళి గౌడ్, క్లబ్ రాష్ట్ర బాధ్యులు బృంగి కృష్ణప్రసాద్ నియోజకవర్గ అధ్యక్షులు అర్థం రవి, సభ్యులు కంభం నరేష్, కిషోర్, కట్టా శ్రీనివాస్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

జగన్ రెడ్డి 420 బుద్ధులు మానుకో..

Satyam NEWS

దొంగ దెబ్బ

Satyam NEWS

సిఎం కేసీఆర్ మార్గదర్శకత్వం వల్లే స్వచ్ఛ అవార్డ్

Satyam NEWS

Leave a Comment