34.2 C
Hyderabad
April 19, 2024 19: 52 PM
Slider ముఖ్యంశాలు

ప్రభుత్వ సలహాదారుడుగా సజ్జల రామకృష్ణారెడ్డికి ఉద్వాసన?

#sajjala

ప్రభుత్వ సలహాదారుడుగా సజ్జల రామకృష్ణారెడ్డికి ఉద్వాసన పలుకుతున్నారా? ఏమో తెలియదు కానీ అధికార పార్టీ అధికార ఛానెల్ లో సజ్జల రామకృష్ణారెడ్డి పేరు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అని రావడంతో పలువురికి ఈ సందేహం వచ్చింది.

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వివరాలు తెలియచేయడంతో బాటు ప్రతిపక్షంపై విమర్శలు చేసేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి తెరపైకి రాగానే అధికార పార్టీ అధికార ఛానెల్ లో ఆయనను ప్రధాన కార్యదర్శిగా సంబోధిస్తూ స్క్రోలింగ్ లో, బ్రేకింగ్ లో వేశారు.

ప్రభుత్వ జీతం తీసుకుంటూ చాలా కాలం నుంచి రాజకీయ విమర్శలు చేస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి తీరుపై ఇప్పటికే పలువురు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయితే ఎవరి విమర్శలు పట్టించుకోకుండా సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కొనసాగిస్తూ వచ్చారు.

సజ్జల రామకృష్ణారెడ్డిని ముందుగా మూడు సంవత్సరాల కాలానికి ప్రభుత్వ సలహాదారుడిగా నియమించారు. అయితే ఆ తర్వాత ఇతర సలహాదారుల కాలపరిమితి రెండు సంవత్సరాలుగా నిర్ణయించినందున సజ్జల పదవి కాల పరిమితిని కూడా రెండు సంవత్సరాలకు కుదించారు.

ఆ రెండు సంవత్సరాల కాలపరిమితి పూర్తి కావడంతో జూన్ ఒకటో తేదీన జీవో ఆర్టీ నెం 1006 ప్రకారం మరో ఏడాది పెంచుతూ ఆదేశాలు వెలువడ్డాయి.

న్యాయ స్థానాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వెలువరించినప్పుడు, రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నప్పుడు  ఇతర కీలక సమయాలలో సజ్జల పలు రకాల రాజకీయ విమర్శలు చేశారు.

గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ లో వై ఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సలహాదారుడుగా డాక్టర్ కె వి పి రామచంద్రరావు ఉండేవారు. ఆయన ఎప్పుడూ కెమెరాల ముందుకు రావడం గానీ, రాజకీయ విమర్శలు చేయడంగానీ జరగలేదు.

అయితే సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రం ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతూనే రాజకీయంగా ఘాటు విమర్శలు చేయడానికి ముందు ఉంటున్నారు. గత కొద్ది కాలంగా సజ్జల రామకృష్ణారెడ్డి పవర్ సెంటర్ గా మారిపోవడంపై కూడా పార్టీలో గుసగుసలు చేసుకుంటున్నారు.

రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కన్నా పవర్ ఫుల్ వ్యక్తిగా సజ్జల మారారని కూడా పార్టీలో చర్చ జరుగుతున్నది.

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా కీలక బాధ్యత పోషిస్తున్న సజ్జల పార్టీ పదవిలోనూ, ప్రభుత్వ పదవిలోనూ కొనసాగడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు లాంటి వ్యక్తులు ఎవరైనా న్యాయస్థానంలో సవాల్ చేస్తే పరిస్థితి చెయ్యిదాటి పోతుందనే అభిప్రాయం కూడా ఉంది.

ప్రభుత్వంలో కీలక స్థానాలలో ఉన్న వ్యక్తుల గురించి రఘురామకృష్ణంరాజు ఇప్పటికే కేసుల్లో ప్రస్తావించి ఉన్నారు. ఈ నేపథ్యంలో సజ్జలను పార్టీలోనే కొనసాగించడం మంచిదనే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి తీసుకున్నారేమోననే అనుమానం కలుగుతున్నది.

Related posts

గుడ్ న్యూస్ : ఉల్లి ధరలు త్వరలో తగ్గబోతున్నాయి

Satyam NEWS

దీపావళికి బద్రీనాథ్ వెళుతున్న ప్రధాని మోదీ

Satyam NEWS

Counter attack: ప్రవీణ్ ప్రకాశ్ ను బదిలీ చేసే ప్రశ్నే లేదు

Satyam NEWS

Leave a Comment