32.7 C
Hyderabad
March 29, 2024 11: 00 AM
Slider కడప

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో గొబ్బిళ్ళ విద్యాధరి విజయ భేరి…

#vidyadhari

కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డి పల్లి గ్రామపంచాయతీ గొల్లపల్లి గ్రామానికి చెందిన గొబ్బిళ్ళ విద్యాధరి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో అల్ ఇండియా సెకండ్,ఉభయ తెలుగు రాష్ట్రాల లల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది.

ఈ ఏడాది నిర్వహించిన సివిల్స్ పరీక్షలో రాణించి 211 ర్యాంకు సాధించింది. ఇప్పుడు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో గొబ్బిళ్ళ విద్యాధరి విజయ భేరి మోగించడం పట్ల తల్లి గొబ్బిళ్ళ సుజాతమ్మ తన కుమార్తె నందలూరు మండలానికి పేరు తేవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.

మండలంలోని పలువురు ప్రముఖులు విద్యాధరి ని అభినందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మూడు ప్రధాన ఆల్ ఇండియా సర్వీస్‌లలో ఒకటి. మిగిలిన రెండు IAS & IPS సర్వీసులు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ పరీక్ష ఎంపిక ప్రక్రియ దాదాపు IAS పరీక్ష మాదిరిగానే ఉంటుంది.

IAS మరియు IFoS రెండింటికీ మొదటి స్థాయి ప్రిలిమ్స్ పరీక్ష ఒకే విధంగా ఉంటుంది. ఫారెస్ట్ సర్వీస్‌లో చాలా తక్కువ ఖాళీలు ఉన్నందున, ప్రిలిమ్స్‌లో కటాఫ్ మార్కు IAS పరీక్ష కంటే 10 నుండి 20 మార్కులు ఎక్కువగా ఉంటుంది. ప్రిలిమ్స్ క్లియర్ అయిన తర్వాత, సివిల్స్ మెయిన్స్ పరీక్ష ముగిసిన వెంటనే ఫారెస్ట్ సర్వీస్ మెయిన్స్ పరీక్ష జరుగుతుంది. ఇంటర్వ్యూ ప్రక్రియ కూడా IAS పరీక్ష మాదిరిగానే ఉంటుంది.

IAS ఇంటర్వ్యూలను తీసుకునే అదే ఇంటర్వ్యూ బోర్డులచే నిర్వహించబడుతుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో గొబ్బిళ్ళ విద్యాధరి అల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించింది. ఉభయ తెలుగు రాష్ట్రాల లల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించడం, సివిల్స్ పరీక్షలో రాణించి 211 ర్యాంకు సాధించడం పట్ల నవంబర్ 6వ తేది రైల్వే కళా క్షేత్రం లో పౌర సన్మానం నిర్వహించనున్నారు.

Related posts

భారీగా పెరిగిన సుందర్‌ పిచాయ్‌ జీతం

Satyam NEWS

ఉగాది కానుక: 387 వలంటీర్లకు సేవారత్న అవార్డులు

Satyam NEWS

మాల మహానాడు మానకొండూరు మండల కమిటీ ఏర్పాటు

Satyam NEWS

Leave a Comment