39.2 C
Hyderabad
March 29, 2024 17: 05 PM
Slider కరీంనగర్

రౌడీషీటర్లపై నిరంతర నిఘా ఉంటుంది జాగ్రత్త

#GodavarikhaniACP

రౌడీషీటర్లు గా నమోదైన వారు చట్టాన్ని చేతిలోకి తీసుకొని తిరిగి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ గోదావరిఖని ఉమేందర్ హెచ్చరించారు. గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలోని రౌడీషీటర్లకు నేడు ఆయన కౌన్సెలింగ్ నిర్వహించారు.

ఇప్పటివరకు గోదావరిఖని సబ్ డివిజన్ పరిధిలో 14 మందిపై పీడీ యాక్ట్ అమలు చేశారు. భూకబ్జాలకు పాల్పడుతున్న కోట కుమార్ పైనా, అక్రమంగా బొగ్గు రవాణా చేస్తున్న వకుళాభరణం శ్రీనివాస్ ఎలియాస్ కుంటి శ్రీను, దుస్స  దేవేందర్ లపై పీడీ యాక్ట్ అమలు చేశామని తెలిపారు.

రౌడీషీటర్ల పై నిరంతరం నిఘా కొనసాగుతుందని ఉమేందర్ తెలిపారు. భూకబ్జాలు సెటిల్మెంట్లు లలో తల దూర్చిన, మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన, చెడు ప్రవర్తనతో, బెదిరింపులకు, ఇతర నేరాలకు పాల్పడే వారిపై చట్ట పరమైన కటిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ హెచ్చరించారు. 

ప్రతి 6 నెలలకు ఒక్కసారి  చెడు ప్రవర్తన కలిగిన వారిని  బైన్డోవర్ చేయడం వల్ల వారిపై  పోలీస్ నిఘా ఉంటుందని, కాబట్టి వారి కదలికలు,  ప్రవర్తన గురించిన విషయాలు తెలుసుకుంటామని ఆయన తెలిపారు.

గోదావరిఖని సబ్ డివిజన్ పరిధి లోని ప్రజల శాంతి భద్రతలు కాపాడటం గోదావరిఖని సబ్ డివిజన్  పోలీస్ ముఖ్య ఉద్దేశ్యం అని ప్రజలు ప్రశాంత వాతావరణం లో జీవించే విధముగా పోలీస్ పనిచేస్తున్నారని ఆయన తెలిపారు.

చెడు వ్యసనాలకు అలవాటుపడి భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని ప్రవర్తనలను మార్చుకొని ప్రశాంత జీవతం గడపాలని ఆయన సూచించారు. ప్రశాంతంగా ఉండే ఏలాంటి అల్లర్లు లేకుండా బతికే వారిని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రౌడీ షీట్ తొలగించేందుకు ప్రయత్నిస్తామన్నారు.

ఈ సందర్భంగా రౌడీషీటర్ల జీవన విధానం, వారి చిరునామాల పై ఆరా తీసి పలు సూచనలు చేశారు.

Related posts

Ballot Battle: పెట్రో మంటలు… సాగు చట్టాలు…

Satyam NEWS

అమ్మ జన్మనిస్తే వైద్యులు పునర్జన్మనిస్తారు

Satyam NEWS

సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే నమ్మకం లేని సీఎం

Bhavani

Leave a Comment