మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించిన టీడీపీ నేతృత్వంలోని కూటమి… రానున్న 30 ఏళ్లు తమదే అధికారమన్న జగన్ కలలను పటాపంచలు చేసింది. అంతటితో ఆగని కూటమి సర్కారు.. వైసీపీ జమానాలో జరిగిన అకృత్యాలపై కేసులు నమోదు చేసి విచారణలకు ఆదేశాలు జారీ చేసింది. వరుసగా చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలను తట్టుకోవడం వైసీపీ తరం కావట్లేదు. ఇలాంటి తరుణంలో టీడీపీ చేస్తున్న ర్యాగింగ్ కు వైసీపీ బెంబేలెత్తిపోతోంది.
అసలు టీడీపీ చేస్తున్న ర్యాగింగ్ కు కనీసం ఎలా స్పందించాలో కూడా వైసీపీ నేతలకు, ఆ పార్టీ సోషల్ మీడియాకు అర్థం కావడం లేదంటే అతిశయోక్తి కాదు. టీడీపీ ఈ స్థాయి ర్యాగింగ్ కు దిగిన వైనం జనంలో అమితాసక్తిని రేకెత్తిస్తుండగా…ఈ ర్యాగింగ్ దెబ్బకు జగన్ తన దుకాణాన్ని మూసివేసుకుని ఎక్కడికో పారిపోవడం మినహా మరో మార్గం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నెల 11న ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి. అంటే… 11వ నెల 11వ తారీఖున సమావేశాలన్న మాట.
ఇక అసెంబ్లీ సమావేశాలు కూడా 11 రోజుల పాటు నిర్వహించాలని కూడా కూటమి సర్కారు తలపోస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే… 11వ నెల 11వ తారీఖున మొదలు కానున్న అసెంబ్లీ సమావేశాలు 11 రోజుల పాటు జరగనున్నాయన్న మాట. ఇలా అన్నింటా 11 సంఖ్య వచ్చేలా టీడీపీ పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నదన్న మాట. అయినా ఈ 11 గోల ఏమిటో ఇప్పటికే అందరికీ తెలిసిపోయినట్టే కదా. అందేనండీ… మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి దక్కిన సీట్ల సంఖ్య 11ను గుర్తు చేస్తూ టీడీపీ తనదైన శైలి ర్యాగింగ్ కు తెర తీసిందన్న మాట.
సాధారణంగా ఈ తరహా ర్యాగింగ్ ను తట్టుకోడం అంటే మామూలు విషయం కాదు మరి వైసీపీ నేతలు ఈ ర్యాగింగ్ ను ఎలా తట్టుకుంటున్నారో, ఏమో అర్థం కాడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం అంకెలు, సంఖ్యలతోనే ర్యాగింగ్ చేయడానికే టీడీపీ పరిమితం కాలేదు. ఈ అసెంబ్లీ సమావేాశాల్లో బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని చెబుతున్న టీడీపీ నేతలు… వైసీపీ నేతలు కూడా తప్పనిసరిగా ఈ సమావేశాలకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ తరహా పిలుపు తొలుత టీడీపీ సీనియర్ మోస్ట్ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నుంచి వచ్చింది.
ప్రజలు గెలిపించిన ప్రజా ప్రతినిధులుగా అందరూ అసెంబ్లీ సమావేశాలకు రాాావాల్సి ఉందన్న అయ్యన్న… వైసీపీ నేతలుకూడా అసెంబ్లీ సమావేశాలకు వస్తారనే తాను అనుకుంటున్నానంటూ వ్యాఖ్యానించారు. ఇతర వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి ఎలా ఉన్నా… రాష్ట్రానికి ఐదేళ్ల పాటు ప్రతిపక్షనేతగా, మరో ఐదేళ్ల పాటు సీఎంగా వ్యవహరించి… ఇప్పుడు కనీసం ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కించుకోలేని జగన్ తప్పనిసరిగా అసెంబ్లీ రావాలని ఆయన కోరారు.
జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై గొంతెత్తుతానంటే… తాను తప్పనిసరిగా ఆయనకు మైకు ఇస్తానని కూడా అయ్యన్న అన్నారు. చివవరగా తనకు నమస్కారం పెట్టాల్సి వస్తుందన్న కారణంతో జగన్ అసెంబ్లీకి రారేమోనని కూడా అనుమానం వ్యక్తం చేశారు.