28.7 C
Hyderabad
April 25, 2024 06: 32 AM
Slider ప్రత్యేకం

హైదరాబాద్‌లో గోల్డ్‌ ఏటీఎం

దేశంలోనే తొలి గోల్డ్‌ ఏటీఎంను హైదరాబాద్‌ బేగంపేటలో ప్రారంభించారు. డెబిట్‌, క్రెడిట్‌ కార్డులతో కావాల్సిన బంగారాన్ని ఇందులో డ్రా చేసుకోవచ్చు. అశోక్‌ రఘుపతి ఛాంబర్స్‌లోని గోల్డ్‌ సిక్కా సంస్థ కార్యాలయంలో ఈ ఏటీఎంను ప్రారంభించారు.  ఈ ఏటీఎం ద్వారా 99.99శాతం శుద్ధత కలిగిన 0.5, 1, 2, 5, 10, 20, 50, 100 గ్రాముల బంగారు నాణేలు డ్రా చేసుకోవచ్చని గోల్డ్‌ సిక్కా సంస్థ సీఈవో సయ్యద్‌ తరుజ్‌ తెలిపారు. బంగారు నాణేలతోపాటు వాటి నాణ్యత, గ్యారంటీ తెలిపే పత్రాలూ జారీ అవుతాయని వెల్లడించారు. త్వరలో నగరంలోని గుల్జార్‌హౌస్‌, సికింద్రాబాద్‌, అబిడ్స్‌తోపాటు పెద్దపల్లి, వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మంలో గోల్డ్‌ ఏటీఎంలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. బంగారం ధరలు ఎప్పటికప్పుడు ఏటీఎం స్క్రీన్‌పై కనిపిస్తాయని వెల్లడించారు.

Related posts

ములుగు జిల్లాకు సమ్మక్క సారక్క పేరు పెట్టాలి – komaram bheem

Satyam NEWS

తెలుగు వెలుగులు విశ్వవ్యాప్తం కావాలి…

Satyam NEWS

[Over-The-Counter] – Male Enhancement Vitamins At Walmart Enzyme Male Enhancement Commercial Nite Rider Natural Male Enhancement

Bhavani

Leave a Comment