27.7 C
Hyderabad
April 20, 2024 02: 27 AM
Slider గుంటూరు

స్విమ్మింగ్: 4 బంగారు పతకాలు సాధించిన షేక్ ఖాజా

swimming

దుబాయ్ లో జరుగుతున్న 3rd International Masters Swimming Championship – 2020 లో షేక్ ఖాజా మొహిదీన్ బంగారు పతకం సాధించాడు. భారతదేశం తరఫున ఈ ఛాంపియన్ షిప్ లో పాల్గొంటున్న షేక్ ఖాజా గుంటూరు జిల్లా నరసరావుపేట ఎస్.ఎస్ & ఎన్ కళాశాలలో ఈత శిక్షకుడు గా పని చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ నెల 5 న ప్రారంభమైన ఈ ఛాంపియన్ షిప్ పోటీలు ఈ నెల 11వ తేదీ వరకూ జరుగుతాయి. ఈ పోటీలలో భారత్ తో బాటు దుబాయ్, ఫిలిప్పైన్స్, శ్రీలంక దేశాల ఈత క్రీడాకారులు పాల్గొంటున్నారు. షేక్ ఖాజా మొహిదీన్ నేడు జరిగిన 100 Mtrs Free Style లో మరొక Gold Medal ను సాధించారు. నిన్న ఆయన మూడు బంగారు పతకాలను సాధించాడు.

మొత్తం నాలుగు బంగారు పతకాలు సాధించిన షేక్ ఖాజా రికార్డు సృష్టించాడు. 200 Mtrs Free Style లో, 50 Mtrs Free Style  లో, 50 Mtrs Butter Fly లో ఆయన Gold Medal సాధించాడు. మొత్తం ఈ టోర్నమెంట్ లో పోటీపడిన 4 ఈవెంట్లలో మొత్తం 4 Gold Medas ను గెలుపొందిన ఖాజా ను నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు టెలిఫోన్ లో అభినందనలు తెలియజేశారు.

Related posts

ఎం‌జి‌బి‌ఎస్ లో స్వాతంత్య్ర సమర యోధుల ఛాయా చిత్ర ప్రదర్శన

Satyam NEWS

అందరికీ కాదు కొందరికే ఆరోగ్య శ్రీ

Satyam NEWS

ఖమ్మం జిల్లా మధిరలో ముగిసిన క్రికెట్ పోటీలు

Satyam NEWS

Leave a Comment