28.7 C
Hyderabad
April 20, 2024 04: 50 AM
Slider క్రీడలు

పెద్దకొత్తపల్లి గురుకుల విద్యార్థికి హైజంప్ లో గోల్డ్ మెడల్

#peddakottapalli

నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి గురుకుల విద్యార్థి హైజంప్ లో స్టేట్ ఫస్ట్ గోల్డ్ మెడల్ సాధించాడు. పెద్దకొత్తపల్లి మండల సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పదవ తరగతి విద్యార్థి పి.కాన్షిరాం ఇటీవల రాష్ట్ర స్థాయిలో జరిగిన ఆటలపోటీలో హై జంప్ లో పాల్గొన్నాడు.

ఆ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించాడని ఆ పాఠశాల ప్రిన్సిపాల్ అకుల్ తెలిపారు. కాన్షిరామ్ స్టేట్ ఫస్ట్ రావడంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. కొల్లాపూర్ మండలం చుక్కాయపల్లి గ్రామానికి చెందిన బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుపుల రామకృష్ణ సోదరుడు పసుపుల నాగరాజు, కవిత కుమారుడు కాన్షిరామ్. అతనికి చిన్నప్పటి నుంచి ఆటలంటే ఆసక్తి ఉండేదాని, ఆటలే కాదు చదువులో కూడా స్కూల్ ఫస్ట్ వస్తుండేవాడని వారన్నారు. అతను హై జంప్ లో స్టేట్ ఫస్ట్ రావడం గర్వంగా ఉంది వారన్నారు.

Related posts

జర్నలిస్ట్ పిడుగు శ్రీనువాసులు గుండెపోటుతో హఠాన్మరణం

Satyam NEWS

విద్యా శాఖలో ఢిల్లీ తరహా విధానం

Bhavani

28న ఢిల్లీకి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు

Bhavani

Leave a Comment