ఆదిశిల క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి గద్వాల కు చెందిన బాణాల విజయసారథి దంపతులు 5 గ్రాముల బంగారు హారం బహూకరించారు. గురువారం శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయంలో జరిగిన కార్యక్రమం లో ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావుకు అందజేయగా పూజలు నిర్వహించారు. ప్రతి పౌర్ణమికి జరిగే స్వామివారి కల్యాణానికి కూడా హారం అలంకరించాలని భక్తులు కోరారు. అనంతరం బాణాల విజయసారథి దంపతులను స్వామివారి శేష వస్త్రం చరిత్ర పుస్తకం అందజేసి ఆశీస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర రావు తదితరులు ఉన్నారు.
previous post