27.7 C
Hyderabad
April 18, 2024 08: 16 AM
Slider సినిమా

సూపర్ స్టార్ కృష్ణ జీవితం అత్యంత స్ఫూర్తిదాయకం

#superstarkrishna

సూపర్ స్టార్, పద్మభూషణ్ కృష్ణ జీవితం స్ఫూర్తిదాయకమని గజల్ మాష్ట్రో  డా.గజల్ శ్రీనివాస్ అన్నారు. సూపర్ స్టార్ కృష్ణ నటించిన మోసగాళ్ళకు మోసగాడు చిత్రం విడుదలై 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కృష్ణ- మహేష్ ఫాన్స్ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా బీమవరంలో స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు.

డా. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు సినిమారంగ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసారని అన్నారు. నటుడుగా, నిర్మాతగా దర్శకుడిగా, ఎడిటరుగా, స్టూడియో అధినేతగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా చలనచిత్ర చరిత్ర పుఠల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు.

భారతీయ చిత్ర చరిత్రలో సాంఘిక, జానపద, కౌబాయ్, చారిత్రాత్మక, జేమ్స్ బాండ్ పాత్రలలో నటించి మెప్పించిన ఏకైక హీరో కృష్ణ అవి అన్నారు. తెలుగు చలనచిత్ర గతిని మార్చిన హీరో కృష్ణ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు యిచ్చి గౌరవించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 

కృష్ణ ఫాన్స్ గౌరవాద్యక్షులు రాయప్రోలు శ్రీనివాస మూర్తి మాట్లాడుతూ ఇండియన్ సిరీస్ పై మొదటి కౌబాయ్ చిత్రంగా, పాన్ ఇండియా మూవీగా నిర్మించిన మోసగాళ్ళకు మోసగాడు చిత్రం ఏడు భాషలలోకి అనువదించారని, 125 దేశాలలో ప్రదర్శించారని అన్నారు.

చైతన్య భారతి అధ్యక్షుడు రాయప్రోలు భగవాన్ అధ్యక్షతన జరిగిన సభలో 50 కేజీల కేకును కట్ చేసారు. కృష్ణ అభిమానులుగా దశాబ్దాల పాటు అభిమాన సంఘాన్ని నడిపి, రంగస్థల నటులుగా పేరెన్నికగన్న మహ్మద్ ఖాజావలి, మానాపురం సత్యనారాయణ, పులఖండం ఉగాది లకు సూపర్ స్టార్ కృష్ణ అవార్డ్స్ అందజేసారు. 

బీమవరం నాగార్జున ఫాన్స్ అధ్యక్షులు యల్.డి ప్రసాద్, ప్రభాస్ ఫాన్స్ అధ్యక్షులు ఉండి వాసు, కృష్ణ ఫాన్స్ నాయకులు బి. హెచ్. సుబ్బరాజు, గంట్లప్రసాద్, బోనం ప్రసాద్,తాతపూడి రాంబాబు, మడారు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాశ్మీర్ లో నిర్భంధాలపై కేంద్రానికి సుప్రీం అక్షింతలు

Satyam NEWS

మోహన్ బాబు, మంచు లక్ష్మి తొలిసారి కలిసి నటిస్తున్న అగ్నినక్షత్రం టైటిల్ లాంచ్

Satyam NEWS

ఎస్‌సిఎస్‌టి అట్రాసిటీ కేసుల్లో ద‌ర్యాప్తు త్వ‌ర‌గా పూర్తి చేయాలి

Satyam NEWS

Leave a Comment