28.7 C
Hyderabad
April 20, 2024 03: 38 AM
Slider హైదరాబాద్

గోలి శ్యామలను అభినందించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత

#KalvakuntlaKavita

భారత్ – శ్రీలంకల మధ్యనున్న పాక్ జలసంధిని ఈది రికార్డు సృష్టించిన గోలి శ్యామలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అభినందించారు. ఎమ్మెల్సీ కవిత ను గోలి శ్యామల హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసారు. 30 మైళ్ల పాక్ జలసంధిని ఈదిన ప్రపంచ రెండవ మహిళగా  గోలి శ్యామల రికార్డు సృష్టించడం గర్వకారణమన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. 

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రోల్ మోడల్ అన్నారు గోలి శ్యామల. మధ్య తరగతి కుటుంబానికి చెందిన తనను, ఎమ్మెల్సీ కవిత అన్ని విధాలుగా ప్రోత్సహించారన్న గోలి శ్యామల, తన కలలను సాకారం చేసుకోవడానికి ఆర్థికంగా చేయూతనిచ్చారని తెలిపారు. అంతేకాదు ఎమ్మెల్సీ కవిత గారికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని గోలి శ్యామల పేర్కొన్నారు.

Related posts

మగ్గం తగలబెట్టిన చేనేత కార్మికునికి టీడీపీ చేయుత

Satyam NEWS

వల్గర్ ఫాదర్:కన్నతండ్రే కామాంధుడయ్యాడు

Satyam NEWS

రతన్ టాటా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అవయవ దానం అవగాహన

Satyam NEWS

Leave a Comment