32.2 C
Hyderabad
April 20, 2024 19: 43 PM
Slider ముఖ్యంశాలు

ఆనందం గా ఉండటం చాల ముఖ్యం

#janardhanreddy

మంచి ప్రవర్తనతో విద్యార్థులు ఉత్తమ మానవులుగా ఎదగాలని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ డాక్టర్‌ బీ జనార్దన్‌రెడ్డి అన్నారు. సీబీఐటీ వార్షిక దినోత్సవం శృతి 2023 ను నేడు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ మీరు ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉండండి. నైపుణ్యం ఎప్పుడూ మనతోనే వస్తుంది. కులం లేదా మతం కాదు. అన్నింటికంటే ఆనందం చాలా ముఖ్యం. మనం ఎక్కువ సంపాదించవచ్చు. కానీ ఆనందం సంపాదించడం సాధ్యం కాదు. ఇంజినీరింగ్ సబ్జెక్టులు జీవనోపాధిని అందిస్తే కళను నేర్పే  విషయలు మనకు  జీవం పోస్తాయి అని చెప్పారు.

ఈ కార్యక్రమానికి గౌరవ అతిథి గా టాలీవుడ్ దర్శక, రచయిత వై విఎస్ చౌదరి మాట్లాడుతూ విద్యార్థి తన జీవితానికి, చదువుకు మధ్య సమతుల్యతను తెలుసుకోవాలన్నారు. మనం ఎవరో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్రపంచం మనకు అత్యంత సమీపంలో ఉంది. ఎల్లప్పుడూ కొరత అనేది  నేర్చుకోవడానికి మరియు అభివృద్ధి చెందడానికి మానకు సహాయపడుతుంది. అనుభవజ్ఞులతో మాట్లాడటం ఎల్లప్పుడూ మనకు పాఠాలు నేర్పుతాయి . ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ముఖ్యఅతిథి సత్కరించారు.

కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి కళాశాల అభివృద్ధి  గురించి చెప్పారు. శృతి 2023 చైర్మన్ ప్రొఫెసర్ పి వి ఆర్ రవీందర్ రెడ్డి శృతి 2023 కార్యక్రమాలు, వివిధ పోటీల విజేతలు గురించి చెప్పారు. ఈ కార్యక్రమం లో కళాశాల  మేనేజ్ మెంట్ సభ్యులు, కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో ముఖ్య అతిథి మరియు  గౌరవ అతిథి మొక్కలు నాటారు.

Related posts

చిలకలూరిపేట తహసీల్దార్ గా తిరిగి బాధ్యతలు చేపట్టిన సుజాత

Satyam NEWS

ఆన్ లైన్ విద్యావిధానంలో యోగాను కూడా చేర్చండి

Satyam NEWS

రోడ్లు ఊడ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment