35.2 C
Hyderabad
April 24, 2024 14: 48 PM
Slider మహబూబ్ నగర్

ఆన్ లైన్ విద్యపై కలెక్టర్ తో చర్చించిన దూరదర్శన్ ఎడిజి

WanaparthyCollector

దూరదర్శన్ ప్రసారాలను, ఆన్ లైన్ విద్యా బోధన ప్రసారాల గురించి వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తో దూరదర్శన్ ఆలిండియా రేడియో సౌత్ జోన్ అడిషనల్ డైరెక్టర్ జనరల్  వి.రమాకాంత్ చర్చించారు.

దూరదర్శన్ లో పాఠాలు వినడంలో ప్రసారపరంగా ఇబ్బందులేమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఏమాత్రం ఇబ్బంది లేదని విద్యాశాఖ అధికారులు చెప్పారు. అన్నిచోట్ల విద్యార్థులు పాఠాలు వింటున్నారన్నారు.

విద్యాసంవత్సరం నష్టపోకుండా విద్యార్థులపట్ల శ్రద్ద తీసుకుని పాఠాలను ప్రసారం చేయడం, అభినందనీయమని కలెక్టర్ అన్నారు. దూరదర్శన్ లో అవసరమైతే కొన్ని కార్యక్రమాలను రద్దు చేసుకునైనా సరే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ లక్ష్యంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నామని రమాకాంత్ వివరించారు.

విద్యార్థుల దగ్గరికి ఉపాధ్యాయులు వెళ్ళినపుడు ఆలిండియా రేడియో ఆయాప్రాంతాలలో వస్తున్నది లేనిది తెలుసుకోవడం వల్ల భవిష్యత్ లో రూపొందించే విద్యా కార్యక్రమాలకు జాగ్రత్తలు తీసుకునేందుకు వీలౌతుందన్నారు.

 తప్పకుండా విద్యార్థులకు ఉపయోగపడే పాఠాల యూట్యూబ్ లింక్ వినియోగించుకునేలా అందరు ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు సమాచారం ఇవ్వాలని కలెక్టర్ విద్యాశాఖాధికారులకు సూచించారు.

Related posts

వరి పంట అడుగులో డీఏపీ నే వాడాలి

Satyam NEWS

మునుగోడు టిక్కెట్ కు బీసీలు అర్హులు కాదా?

Satyam NEWS

అమరవీరుల కుటుంబ సభ్యులకు అండ గా వుంటాం

Murali Krishna

Leave a Comment