33.2 C
Hyderabad
April 26, 2024 00: 26 AM
Slider నల్గొండ

మెరుగైన వైద్య సేవలు అందేలా అంకితభావంతో పనిచేయాలి

ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలందేలా అన్ని స్థాయిలలో అంకిత భావంతో కృషి చేయాలని ఎంపిపి గూడేపు శ్రీనివాస్ అన్నారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ లింగగిరి పి హెచ్ సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ అధ్యక్షతన జన ఆరోగ్య సమితి మండల స్థాయి సమావేశం జరిగింది.ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు,హెల్త్‌ వెల్‌ నెస్‌ సెంటర్లు,ఆసుపత్రులలో వైద్య సేవల తీరు, నిర్వహణ,మౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు.

ఈ సందర్భంగా గూడెపు శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో హాస్పిటల్‌ డెవలప్మెంట్‌ సొసైటీలు(హెచ్‌ డీ ఎస్‌)గా కొనసాగిన వాటిని ప్రస్తుతం జన ఆరోగ్య సమితిగా వ్యవహరించడం జరుగుతుందని అన్నారు.ప్రజా ప్రతినిధులు,స్వచ్చంద సంస్థలను భాగస్వాములు చేస్తూ సబ్‌ సెంటర్‌,పి హెచ్‌ సి,హెల్త్‌ వెల్‌ నెస్‌ సెంటర్‌ అన్ని స్థాయిలలో జన ఆరోగ్య సమితి కమిటీలను ఏర్పాటు జరిగినట్టు, నిబంధనలు అనుసరిస్తూ క్రమం తప్పకుండా ప్రతీ నెల సమావేశాలు నిర్వహిస్తూ,ప్రజలకు అందుతున్న వైద్య సేవల తీరును క్షుణ్ణంగా సమీక్షించాలని సూచించారు. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే వాటిని సరిచేసుకుంటూ సేవలను మెరుగుపర్చుకోవాలని కోరారు.ప్రతి కేంద్రంలో సిటిజన్స్ చార్ట్‌ ను తప్పనిసరిగా ప్రదర్శించాలని అన్నారు.నీటి వసతి, శానిటేషన్‌, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అన్నారు.

సమావేశంలో మండల వైద్యాధికారి డాక్టర్ సన,ఎం పి డి ఓ శాంత కుమారి, ఎం ఈ ఓ సైదా నాయక్,డి టి సుధారాణి,ఇన్చార్జి సిడిపిఓ హేమాదేవి, వెంకమ్మ, నుర్జాహన్ బేగం,ప్రభాకర్, ఇందిరాల రామకృష్ణ, ఉదయగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

వైసీపీ ‘‘పేటీఎం బ్యాచ్’’ లో చేరిన బిజెపి నేతలపై త్వరలో వేటు?

Satyam NEWS

రాహుల్ గాంధీ జన్మదిన సందర్భంగా పాలు పండ్లు పంపిణీ

Satyam NEWS

కళ్లకు గంతలు కట్టుకున్న గాంధారిలా విజయమ్మ

Satyam NEWS

Leave a Comment