27.7 C
Hyderabad
April 26, 2024 03: 23 AM
Slider ప్రత్యేకం

గుడ్ న్యూస్: టీటీడీ అవుట్ సోర్సింగ్ కార్మికులకు శుభవార్త

#NaveenkumarReddy

తొలగించిన 1400 మంది ఔట్ సోర్సింగ్ కార్మికులను రేపటి నుంచి తిరిగి విధుల్లోకి రావాలని సూపర్వైజర్లకు, కార్మికులకు అధికారుల తిరుమల తిరుపతి దేవస్థానం వర్తమానం పంపిందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, ఐఎన్టియుసి జిల్లా గౌరవ అధ్యక్షులు, కాంగ్రెస్ నేత నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు.

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో వారందరికి మళ్లీ కొలువులు దొరికినందుకు సంతోషం గా ఉందని ఆయన చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం లో 15 సంవత్సరాలుగా అవుట్ సోర్సింగ్ కార్మికులుగా, సూపర్వైజర్ లుగా పనిచేస్తూ నిన్నటి నుంచి తొలగింపు నకు గురైన 1400 మంది కార్మికులను, సూపర్వైజర్ లను రేపటి నుంచి తిరిగి యధావిధిగా విధుల్లోకి తీసుకుంటూ నిర్ణయం తీసుకున్నారని ఆయన వివరించారు.

ప్రస్తుతమున్న కాంట్రాక్ట్ గడువు మరో నెల రోజుల పాటు పొడిగిస్తూ టిటిడి ఉన్నతాధికారుల నిర్ణయం తీసుకున్నారని ఆయన చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానం కాంట్రాక్టు సిబ్బందికి ఆవేదనను సత్యం న్యూస్ ఉదయం పాఠకుల దృష్టికి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. టీటీడీ ఉన్నతాధికారులు ఇప్పటికైనా పెండింగ్ లో ఉన్న హౌస్ కీపింగ్ టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తిచేసి కార్మికులకు తిరిని సమస్యలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన కోరారు. టిటిడి అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలపై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు, టీటీడీ చైర్మన్ కు తిరుపతి చంద్రగిరి శాసనసభ్యులు టీటీడీ ఎక్స్ అఫిషియో సభ్యులకు, అఖిలపక్ష పార్టీ నాయకులకు 1400 మంది అవుట్సోర్సింగ్ కార్మికుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

నిన్న కొడుకు..నేడు తండ్రి..కరోనా కాటుకు ఇద్దరూ బలి

Satyam NEWS

ఏళ్లుగా ఖాళీగానే పోస్టులు

Murali Krishna

ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ముఠా అరెస్టు

Bhavani

Leave a Comment