అతనొక రియల్ ఎస్టేట్ వ్యాపారి. తనకు కావాల్సిన ప్రాంతాన్ని గూగుల్ ఎర్త్ లో అతను పరిశీలిస్తున్నాడు. గూగుల్ ఎర్త్ సాయంతో ప్రపంచాన్ని 360 డిగ్రీల్లో వీక్షించడానికి వీలవుతుందన్న విషయం తెలిసిందే కదా. అతను మూన్ బే ప్రాంతాన్ని గూగుల్ ఎర్త్ లో చూస్తున్నాడు. అకస్మాత్తుగా అతనికి నీటిలో మునిగి ఉన్న కారు కనిపించింది. దాంతో అతను మరింత ఆసక్తిగా చూడటంతో ఆ కారులో ఓ అస్థిపంజరం బయటపడడం ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిందీ సంఘటన. ఈ విషయాన్ని పామ్ బీచ్ పోలీసులకు తెలిపాడు. వెంటనే స్పందించిన పోలీసులు ఆ కారును బయటికి తీయగా, అందులో ఓ వ్యక్తి అస్థిపంజరం దర్శనమిచ్చింది. ఫోరెన్సిక్ పరీక్షల అనంతరం అది 22 ఏళ్ల క్రితం మిస్సయిన విలియం మోల్డిట్ దని తెలుసుకున్నారు. 1997 నవంబరు 7న ఫ్లోరిడాలోని వెల్లింగ్టన్ కు చెందిన విలియ్ ఎర్ల్ మోల్డిట్ అనే వ్యక్తి అదృశ్యమయ్యాడు. ఓ నైట్ క్లబ్ నుంచి ఇంటికి వెళ్లే క్రమంలో అతడి ఆచూకీ లభ్యం కాలేదు. విలియం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్నారు. అప్పటి అతని ఆనవాలు ఇప్పడు దొరికాయి. దీనికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోంది.
previous post
next post