దేశవ్యాప్తంగా ఉల్లి పాయలు ధరలు పెరిగి, ప్రజల నుంచి వ్యతిరేకత పెల్లుబుకుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాటి రేట్లను తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఉల్లి పాయల ఎగుమతులపై నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
previous post
next post