ఏలూరు జిల్లా గృహనిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ కె వి ఎస్ ఆర్ రవికుమార్ ని సరెండర్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనను హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ కి రిపోర్ట్ చెయ్యమని జిల్లా ఉన్నతాధికారులు తెలిపినట్టు సమాచారం. రవికుమార్ గతం లో వీరవాసరం, నల్లజర్ల, ద్వారకా తిరుమల, అత్తిలి మండలాల ఎం పి డి ఓ గా ను తరువాత జిల్లా పరిషత్ సీ ఈ ఓ గా విధులు నిర్వహించారు. సీ ఈ ఓ గా పనిచేసే కాలం లో రవికుమార్ పై అనేక అవినీతి అక్రమాల కు పాల్పడ్డారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
అంతే కాదు ఏలూరు నగరానికి చెందిన రవికుమార్ సొంత జిల్లా లో విధులు నిర్వహించ రాదని తెలిసి కూడా ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి జిల్లా ఉన్నతాధికారుల అండ దండలతో సొంత జిల్లాలోనే విధులు నిర్వహించారని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల సందర్భం గా జరిగిన బదిలీలలో కూడా ఈయన ను జిల్లా ఉన్నతాధికారులు చూసి చూడనట్టు వదిలేశారని సమాచారం. ఎన్నికల ముందు కూడా రవికుమార్ బదిలీ అయ్యారు అనే సమాచారం బయటకు పొక్కింది.
మళ్ళీ కొద్దిరోజులకే రవి కుమార్ ని సొంత జిల్లా కేంద్ర మైన ఏలూరు జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ గా పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం విశేషం. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారం లోకి రావడం తో రవికుమార్ పై వచ్చిన అవినీతి అక్రమాలకు సంబంధించి ఇటీవల జరిగిన జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ సమావేశం లో దెందులూరు ఎం ఎల్ ఏ చింతమనేని ప్రభాకర్ గృహ నిర్మాణ సాక్షుఆ పి డి గా కొనసాగుతున్న రవికుమార్ వ్యవహారం పై భగ్గు మన్నారు.
రవికుమార్ ని వెంటనే సరెండర్ చేసి మాతృ శాఖకు పంపాలని జిల్లా కలెక్టర్ సమక్షం లో రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్ధ సారధి ని కోరిన సంగతి తెలిసిందే. దీని పై స్పందించి మంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రవి కుమార్ పై వచ్చిన ఆరోపణలు విచారించిన అనంతరం ఆయనను తన మాతృ శాఖ పంచాయతీ రాజ్ కు పంపుతారని తెలిసింది.జి ల్లా పి డి గా జాంగా రెడ్డి గూడెం డివిజన్ గృహ నిర్మాణ శాఖ ఈ ఈ ఏ శ్రీనివాసరావు కి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.