28.7 C
Hyderabad
April 20, 2024 06: 57 AM
Slider ప్రత్యేకం

సజ్జల కమిటీతో చర్చలకు వెళ్లని ఉద్యోగ సంఘాలు

#sajjala

పీఆర్సీ ప్రతిష్టంభనపై ప్రభుత్వం నియమించిన కమిటీతో చర్చలకు ఉద్యోగ సంఘాల నాయకులు వెళ్లలేదు. దాంతో రేపు కూడా చర్చలకు రమ్మని ఆహ్వానిస్తున్నట్లు కమిటీ సభ్యుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీని గుర్తించబోమని ఉద్యోగ సంఘాలు చెప్పడం మంచిది కాదని ఆయన అన్నారు. అపోహలు ఉంటే కమిటీతో మాట్లాడి నివృత్తి చేసుకోవాలని ఆయన అన్నారు. సోమవారం పీఆర్సీపై మంత్రుల కమిటీ సమావేశం ముగిసిన తర్వాత సజ్జల మీడియాతో మాట్లాడారు. ‘ఉద్యోగులు పరిస్థితిని అర్థం చేసుకోవాలి. రేపు కూడా చర్చలకు రమ్మని పిలుస్తాం. కమిటీని గుర్తించబోమని చెప్పడం ప్రతిష్టంభన పెంచడమే. ఉద్యోగుల అంశంపై కమిటీ మధ్యవర్తిత్వం వహిస్తుంది. మేము ఎప్పుడూ చర్చలకు సిద్ధంగానే ఉన్నాం. ఉద్యోగులను చర్చలకు పిలించాం. చర్చలకు ఉద్యోగ సంఘాలు రాలేదు. చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఉద్యోగులు ఎప్పుడూ ప్రభుత్వంలో భాగమే’ అని తెలిపారు.

Related posts

మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఆరో రోజు అన్నదానం

Satyam NEWS

డయాగ్నోస్టిక్స్ ల్యాబ్ ప్రారంభించిన డాక్టర్ చదలవాడ

Satyam NEWS

ఈత సరదా తో వెళితే ముగ్గురి ప్రాణాలు తీసిన పులిగుండాల

Satyam NEWS

Leave a Comment