37.2 C
Hyderabad
March 29, 2024 19: 32 PM
Slider నల్గొండ

రైతుల భూమిలో రైతు వేదిక నిర్మాణం ఆపాలి

#Farmers Nakrekal

రైతుల సొంత భూముల్లో ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న రైతు వేదికను తక్షణం ఆపాలని రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెంలో ఈ సంఘటన జరిగింది. తహసిల్దార్, ఎంపిడివో, ఏఈ పంచాయతీరాజ్ , ఏవో అగ్రికల్చర్  ఆఫీసుల ముందు రైతులు పెద్ద ఎత్తున ధర్నాలు నిర్వహించారు.

భూ ప్రక్షాళన అనంతరం రైతులకిచ్చిన రైతుబంధు పట్టాలను పరిగణనలోకి తీసుకోకుండా, రియల్ ఎస్టేట్ వ్యాపారుల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ఆధారంగా ఎల్లారెడ్డిగూడెంలో వివాదాస్పద భూమిలో రైతువేదిక నిర్మిస్తున్నారని ప్రజా పోరాట సమితి (పి.ఆర్.పి.ఎస్.) రాష్ట్ర అధ్యక్షులు నూనె వెంకట్ స్వామి ఆరోపించారు.

ఈ ఆందోళనలో ప్రజా పోరాట సమితి (PRPS) నాయకులు దేశగాని వెంకటేశ్ ముదిరాజ్ , ముప్పిడి మారయ్య, ఎన్నమళ్ళ పృధ్వీరాజ్, దేశగాని వేణుగోపాల్, పాల వెంకట్, మైల పిచ్చయ్యయాదవ్, మారగోని శ్రీనివాస్ గౌడ్, ఉయ్యాల ప్రసాద్ గౌడ్, ఉయ్యాల లింగ స్వామిగౌడ్ లతో పాటు బాధిత రైతులైన చిక్కుళ్ళ వెంకటయ్య, చిక్కుళ్ళ నరసింహ, చిక్కుళ్ళ మారయ్య, చిక్కుళ్ళ వెంకన్న, చిక్కుళ్ళ స్వామి వారి కుటుంబాలు పాల్గొన్నాయి.

తక్షణం ఎల్లారెడ్డి గూడెంలో “రైతు వేదిక” నిర్మాణాన్ని ఖాళీ చేయించాలని, లేకపోతే భారీస్థాయిలో ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో ఖాళీ చేయిస్తామని” ప్రజా పోరాట సమితి రెవెన్యూ అధికారులను హెచ్చరించింది.

Related posts

కరోనాను కడతేర్చు మా తల్లి

Satyam NEWS

తెలంగాణ  రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

Satyam NEWS

మంత్రి హరీష్ రావు కాన్వాయ్ కి తప్పిన పెను ప్రమాదం

Satyam NEWS

Leave a Comment