36.2 C
Hyderabad
April 25, 2024 22: 29 PM
Slider నల్గొండ

అడ్డా మీది కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం వైఫల్యం

#hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శాంతి స్తూప సమీపంలో ఉన్న కార్మికుల అడ్డా వద్ద భవన నిర్మాణ కార్మిక సిఐటియు అనుబంధ సంఘం పట్టణ అధ్యక్షుడు ఉప్పతల వెంకన్న ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా గోడ పత్రికను విడుదల చేశారు.

ఈ కార్యక్రమానికి ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ప్రతిరోజు జీవన ఉపాధి కొరకు పరిసర ప్రాంతాల నుండి అత్యధిక సంఖ్యలో మహిళా కార్మికులు అడ్డా వద్దకు వస్తారని, ఇక్కడ గంటల తరబడి నిలబడి పని కోసం ఎదురు చూస్తారని, మౌళిక సదుపాయాల లేక మహిళా కార్మికులు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని,ఆవేదన వ్యక్తం చేశారు.కార్మికుల సంక్షేమమే లక్ష్యం అని చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే భవన,ఇతర నిర్మాణ కార్మిక 1996 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని,కార్మిక అడ్డాలలో షెడ్లు మరుగుదొడ్లు,మంచినీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన నల్ల చట్టాల సవరణ బిల్లు రద్దు కొరకు 27న, జరిగే భారత్ బంద్ లో జిల్లాలోని భవన నిర్మాణ కార్మికులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కార్మికులను కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి,మండల కన్వీనర్ ఉప్పతల గోవిందు,భవన నిర్మాణ కార్మిక సంఘం పట్టణ అధ్యక్షుడు ఉప్పతల వెంకన్న, పల్లపు రామకృష్ణ,షేక్ ముస్తాఫా,శీలం వేణు, సైదులు,వీర నాగేశ్వరరావు, శ్రీను, నాగరాజు అంజి,లక్ష్మీ,శారద,తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్,హుజూర్ నగర్

Related posts

How to Buy XRP in 2023 With PayPal or Credit Card

Bhavani

వైసీపీ లో చేరలేదనే అక్రమ కేసులు పెడుతున్నారు

Satyam NEWS

రాజకీయ నామ సంవత్సరం

Satyam NEWS

Leave a Comment