27.7 C
Hyderabad
April 19, 2024 23: 41 PM
Slider నిజామాబాద్

కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రి పని చెయ్యాలి

#Yellareddy

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణ కేంద్రం లో శుక్రవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ పై  అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. డాక్టర్ రవీంద్ర మోహన్ ఆధ్వర్యం లో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా మునిసిపల్ చైర్మన్ సత్యనారాయణ  హాజరయ్యారు.

ఈ నెల 18 న  కోవిడ్ వ్యాక్సిన్  ను ఎవరికి ఇవ్వాలో సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో మునిసిపల్ చైర్మన్ సత్యనారాయణ మాట్లాడుతూ  ప్రభుత్వాసుపత్రి  కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ వైద్యులు పనిచేయాలని కోరారు.

30 పడకల ఆసుపత్రి లో 5 గురు డాక్టర్స్ పనిచేస్తున్నట్లు  ముఖ్యంగా మహిళల కోసం  గైనకాలజిస్ట్ ను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  అనస్తీషియా డాక్టర్ లేకపోవడంతో  ప్రసవాలు జరగకపోవడంపై  విచారం వ్యక్తం చేశారు. త్వరలోనే ఎమ్మెల్యే జాజల సురేందర్ తో మాట్లాడి అనస్తీషియా  డాక్టర్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

సాధ్యమైనంత వరకు  ప్రభుత్వ ఆసుపత్రిలో  ప్రసవాలు జరిగే విధంగా  చూడాలని  సూపరింటెండెంట్ రవీంద్ర మోహన్ ను కోరారు  ఆసుపత్రి లో  సిబ్బంది  లేకపోతే భర్తీకి  ఏర్పాటు చేస్తామని అన్నారు.

కోవిడ్ వ్యాక్సిన్ ను  డాక్టర్స్  పర్యవేక్షణలో  ఎవరికి ఇవ్వాలో పై అధికారుల నిర్ణయం మేరకు ఇస్తారని  అందుకోసం  అన్ని ఏర్పాట్లు చేసారని  ఎలాంటి ఇబ్బందులు  తలయెత్తకుండా  మునిసిపల్ సిబ్బంది ని అందుబాటులో ఉంచుతామని ఆయన అన్నారు.  

కార్పొరేట్  ను  మించిన సదుపాయాలు కల్పిస్తుంది  కేసీఆర్ ప్రభుత్వం  అన్ని రకాల పరికరాలు  ను కూడా  ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో  డాక్టర్స్, జడ్పిటిసి ఉష గౌడ్ కౌన్సెలర్స్ బూమ్ గారి రాము, కంఠం అప్పా యంపిటిసి సంతోష్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

పరుగెత్తే పట్టణాలు: పాడైన కరెంటు స్తంభాలను సరి చేయండి

Satyam NEWS

బావ మీద కోపంతో బాలకృష్ణ సినిమాకు అడ్డంకులు

Bhavani

PBDAV మోడల్ స్కూల్ నూతన విద్యార్థి మండలి వేడుక

Satyam NEWS

Leave a Comment