37.2 C
Hyderabad
March 28, 2024 18: 09 PM
Slider ముఖ్యంశాలు

ఏపిలో మధ్యాహ్నం 1 గంట వరకు బస్సులు బంద్

#PerniNani

విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజాసంఘాలు ఈ నెల 5 రాష్ట్ర బంద్ నకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ రాష్ట్ర బంద్ కు జగన్ ప్రభుత్వం కూడా మద్దతు తెలిపింది.

ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోకుండా, ఆర్టీసీ బస్సులను 5 వ తేదీన మధ్యాహ్నం 1 గంట వరకు నడపరాదని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పేర్ని నాని తెలిపారు. మధ్యాహ్నం తర్వాత ప్రజలకు అసౌకర్యం కలగకుండా బస్సులు తిరిగేలా సహకరించాలని  ఆర్టీసీ సోదరులు బ్లాక్ బ్యాడ్జీలతో మధ్యాహ్నం విధులకు హాజరు కావడం ద్వారా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ సంఘీభావాన్ని వ్యక్తం చేయాలని కోరుతున్నామన్నారు.

విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్  ప్రభుత్వం మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. తెలుగు వాళ్ళ పోరాట ఫలితమన్నారు.  అనేక పోరాటాలు, 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రజల ఆస్తిగానే ఉంచాలని వైఎస్సాఆర్సీపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తోందన్నారు.

ప్రజల్ని గుండెల్లో పెట్టుకుని చూసుకునే జగన్ ప్రభుత్వం.. విశాఖ ఉక్కును ప్రజల ఆస్తిగా ఉంచే విధంగా కేంద్రం కూడా నిర్ణయం తీసుకోవాలని మరోసారి డిమాండ్ చేస్తున్నామన్నారు. వ్యాపారం చేయడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత కానప్పటికీ, ప్రతి వస్తువు ప్రైవేటు చేతుల్లో ఉంటే.. ధరలు నియంత్రించడం కష్టమయ్యే పని. కాబట్టి,  ప్రజలకు అవసరమైనవి కొన్ని కచ్చితంగా ప్రభుత్వం చేతుల్లోనే  ఉండాలన్నది మా ప్రభుత్వ విధానమన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు లేవు అన్న పరిస్థితుల్లో మాత్రమే ప్రైవేటీకరణకు వెళ్ళాలని ప్రతిదీ ప్రైవేటుపరం చేయడం కరెక్టు కాదన్నారు.

విశాఖ ఉక్కు అప్పుల ఊబిలో ఉంటే, దాని నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఇప్పటికే సీఎం జగన్ గారు చూపించారని మంత్రి పేర్కొన్నారు. దేశంలోనే కాదు, ప్రపంచంలోనే ప్రైవేటీకరణ కాకుండా, ఒక కార్పొరేషన్ ను ప్రభుత్వ సంస్థగా, అందులో పనిచేస్తున్న ఉద్యోగస్తులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఆర్టీసీని ప్రజల ఆస్తిగా మార్చిన ఘనత ఈ ప్రభుత్వానిదన్నారు. 

ఆర్టీసీని బతికించాలని, ప్రైవేటు వ్యక్తుల దోపిడీని అరికట్టి, సామాన్యులకు సేవలు అందించాలనే ఏకైక లక్ష్యంతో వైఎస్సాఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించి, ప్రభుత్వంపైన అదనంగా  3600 కోట్ల జీతభత్యాల భారం  పడుతున్నా, ఆర్టీసీని ప్రజల ఆస్తిగా ఉండాలనే దానిని ప్రభుత్వంలో విలీనం చేశాం. అలానే విశాఖ ఉక్కును కూడా ప్రజల ఆస్తిగా ఉంచాలని డిమాండ్ చేస్తున్నాం.  విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అన్నదే మా నినాదమని మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు

Related posts

ఉగాది వేడుకలకు ముస్తాబు కానున్న శ్రీ మన్నారు రాజగోపాల స్వామి ఆలయం

Satyam NEWS

జ్యోతిరావు ఫులే ఆశయాలు నేటి సమాజానికి స్ఫూర్తిదాయకం

Bhavani

పిఎం మెసేజ్: మే 3 వరకూ లాక్ డౌన్ పొడిగింపు

Satyam NEWS

Leave a Comment