30.7 C
Hyderabad
April 19, 2024 10: 45 AM
Slider విజయనగరం

అశోక్ గజపతి రాజును మళ్లీ అవమానించిన ప్రభుత్వం

#ashokgajapatiraju

మాన్సాస్ ట్ర‌స్ట్ (మ‌హ‌రాజా అల‌క్ నారాయ‌ణ ఆర్డ్స్ అండ్ సైన్స్  ట్ర‌స్ట్ చైర్మ‌న్ గా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గ‌జ‌ప‌తి రాజు బాధ్య‌త‌లు స్వీక‌రించారు.

ఒక్క రోజు ముందే సింహాచ‌లం అప్స‌న్న‌ను ద‌ర్శించుకున్న అశోక్ గ‌జ‌ప‌తి రాజు…తాజాగా  విజ‌య‌న‌గ‌రం కోటలో ఉన్న మాన్సాస్ ట్రస్ట్ లో దానికి చైర్మ‌న్ గా ప‌ద‌వీబాధ్య‌త‌లు చేప‌ట్టారు.

ఈ సంద‌ర్బంగా అధికారులు గైర్హాజ‌రుపై అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. అశోక్ బాధ్య‌త‌లు స్వీక‌రించే స‌మ‌యంలో మాన్సాప్ ఈఓ ,క‌ర‌స్పాండెంట్ కూడా అందుబాటులో లేక‌పోవ‌డం విశేషం.

దీంతో అశోక్  తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. సింహాచలం ఆలయ ఈవో కూడా నిన్న నన్ను కలవడానికి ఇష్టపడలేద‌న్నారు.

రామతీర్థానికి పంపిన చెక్కును వెనక్కి పంపి త‌న‌ను మానసిక క్షోభకు గురిచేశారన్నారు. ఇక క‌నీసం రామతీర్థం విగ్రహ పునఃప్రతిష్ట కార్యక్రమానికి తనను ఆహ్వానించలేదన్నారు.

ఇక మాన్సాస్ భూముల్లో ఇసుక అక్రమాలు ఎవరి హయాంలో జరిగాయో నిగ్గు తేల్చాలని…అస‌లు మాన్సాప్ కార్యాల‌యాన్ని వ‌ విజయనగరం నుంచి ఎందుకు తరలిస్తున్నారో తెలియటలేద‌ని టీడీపీ సీనియ‌ర్ నేత పోలిట్ బ్యూటీ స‌భ్యుడు,కేంద్ర మాజీ మంత్రి: అశోక్ ప్ర‌శ్నించారు.

ఈ ప‌ద‌వీ స్వీక‌ర‌ణ కార్య‌క్ర‌మంలో అశోక్ వెంట‌ విజ్జ‌పు ప్ర‌సాద్,ఐవీపీ రాజు,క‌న‌క‌ల ముర‌ళీమోహ‌న్, నాలుగు ఎస్సెల రాజు ఇతర టీడీపీ నేత‌లు ఉన్నారు.

Related posts

కౌలు రైతులను, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

Satyam NEWS

మార్పు కోసం కొల్లాపూర్ ప్రజల తిరుగుబాటు చేసి నేటికి రెండేళ్లు

Satyam NEWS

హైదరాబాద్ శివారులో భారీగా నకిలీ మద్యం

Bhavani

Leave a Comment