Slider ఆంధ్రప్రదేశ్

క్లియర్: ఆస్తుల అమ్మకం వెనుక రాష్ట్ర ప్రభుత్వమే ఉంది

శ్రీవారి ఆస్తులను అమ్మలన్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆలోచన వెనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉందని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్.కె.నారాయణ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసిన ట్రస్టు బోర్డు తనంత తానుగా నిర్ణయం తీసుకొని ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వమే దీని వెనుకాల ఉండి ప్రోత్సాహిస్తుందని ఆయన అన్నారు. తక్షణమే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన తెలిపారు.

భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా టిటిడి ఎలా నిర్ణయం చేస్తుందని ఆయన ప్రశ్నించారు. తిరుమల శ్రీవారికి దేశ వ్యాప్తంగా ఆస్తులు ఉన్నాయి. వాటన్నిటినీ అమ్ముకుంటూ పోతే శ్రీవారికి  ఆస్తి అంటూ ఎమీ మిగలదు అని ఆయన అన్నారు. తమిళనాడు లోని  శ్రీవారి ఆస్తులను అమ్మలనుకుంటున్న టిటిడి నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని నారాయణ స్పష్టం చేశారు.

Related posts

రజక సంఘం రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ గా ఎంపిపి గూడెపు శ్రీనివాస్

Satyam NEWS

కేసీఆర్‌కు దమ్ముంటే ఈటలపై పోటీ చేయాలి

mamatha

మే 27 న హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో యోగా కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment