28.2 C
Hyderabad
April 20, 2024 12: 57 PM
Slider గుంటూరు

పని చేయించుకుని బిల్లులు ఇవ్వని ప్రభుత్వం ఇది

#dr.Chadalawada

నీరు చెట్టు ఉపాధి హామీ పంచాయతీ రాజ్ పనులకు సంబంధించిన బిల్లులు రెండు సంవత్సరాలు గడిచిన ఇవ్వకపోవడంతో ఆ పనులు చేసిన వారు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉందని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు.

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మానవత్వంతో ఆలోచించి ఆ పనులకు సంబంధించిన బిల్లులు వెంటనే మంజూరు చేయాలని డా౹౹చదలవాడ డిమాండ్ చేశారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ పనులు చేసేందుకు పెట్టుబడి కోసం అప్పులు చేసి వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు.

వారు ఏ ఆఘాయిత్యానికి పాల్పడినా ఈ ప్రభుత్వానికి వారి శాపం తగలక తప్పదన్నారు. పట్టణ శివారులోని తిడ్కో గృహాలను వెంటనే పనులు పూర్తిచేసి లబ్ధిదారులకు కేటాయించాలని కోరారు. వసతులు లేకుండా పేదలకు గృహాలు నిర్మిస్తున్నారని ఇందులోనూ భారీగా అవినీతి జరుగుతోందని ఆయన విమర్శించారు.

నిన్నటి నుంచి కురుస్తున్న చిన్నపాటి వర్షానికి వైయస్సార్ హౌసింగ్ కాలనీ లు చేపల చెరువులను తలపిస్తున్నాయి అని నిజంగా పేదలపై ప్రేమ ఉన్నట్లయితే వారికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించి తర్వాత నిర్మాణాలు చేపడితే బాగుంటుందని హితవు పలికారు.

అదేవిధంగా రాష్ట్రంలో ఒకపక్క వృద్ధాప్య ,వితంతు, ఒంటరి మహిళ పెన్షన్ లు మరియు రేషన్ కార్డులు తొలగిస్తూ మళ్లీ ఈరోజు కాపు నేస్తం రెండో విడత విడుదల చేస్తున్నామని ప్రకటించిన లు గుప్పించడం ఎవరిని మోసం చేయడానికి అని అన్నారు.

Related posts

టెలికం కంపెనీలకు కొత్త నిబంధనలు

Sub Editor

రామ్ గోపాల్ వర్మకు కరోనా… వచ్చింది/రాలేదు

Satyam NEWS

లేడీ సూపర్ స్టార్ నయనతార ఇక బాలివుడ్ లోకి

Satyam NEWS

Leave a Comment