39.2 C
Hyderabad
March 29, 2024 13: 22 PM
Slider ఆంధ్రప్రదేశ్

లైంగిక నేరాల నియంత్రణకు కఠిన చర్యలు

women ministers

రోజురోజుకూ పెరిగిపోతున్న లైంగిక వేధింపులను నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. సచివాలయంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో సోమవారం ‘లైంగిక నేరాల నుండి బాలల రక్షణ చట్టం-2012’ అనే అంశంపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.దమయంతి అధ్యక్షత వహించారు.

సమీక్షా సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత,  మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్కే రోజా తదితరులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మాట్లాడుతూ పిల్లల్ని దైవంతో సమానంగా చూసుకుంటున్నామన్నారు. వీరిపై వయసుతో సంబంధం లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిలో అలాంటి ఆలోచన వచ్చిందంటే వారిలోని మానసిక, శారీరక సమస్యల వల్లే ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారన్నారు. ఫోక్సో చట్టంపై ప్రజల్లో అవగాహన లేకపోవడం వలన పదే పదే నేరగాళ్లు లైంగికదాడులకు పాల్పడుతున్నారన్నారు. పోలీసు శాఖ, వైద్య ఆరోగ్య శాఖకు ఫోక్సో చట్టంపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను మంత్రి గుర్తుచేశారు. దాడులకు గురైన వారిని ఇష్టారాజ్యంగా ప్రశ్నించడం, ఇబ్బందులకు గురిచేయకుండా ఫ్రెండ్లీ పోలీసు విధానాలను కొనసాగించాలని కోరారు.

దాడులు జరిగిన తర్వాత తీసుకునే చర్యల కన్నా దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మహిళలపై జరుగుతున్న అన్ని రకాల దాడులను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. బాలబాలికలకు విద్యార్థి దశ నుంచే విడివిడిగా ఉపాధ్యాయులతో లైంగిక అంశాలకు సంబంధించి అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.

ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే.రోజా మాట్లాడుతూ ఎక్కడ చూసినా బాలలపై నేరాలు,ఘోరాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత సమాజంలో ఈ నేరాల సంఖ్య ప్రమాదకరస్థాయికి చేరాయన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోతుల సునీత, రంపచోడవరం ఎమ్మెల్యే  నాగులపల్లి ధనలక్ష్మీ,  ప్రిన్సిపల్ సెక్రటరీ కె.దమయంతి, హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కె.కిషోర్ కుమార్, కమిషనర్ కృత్తికా శుక్లా, సీఐడీ పోలీస్ డిపార్ట్ మెంట్ సరిత, సెఫ్టీ అండ్ సెక్యూరిటీ గర్ల్ చిల్ర్రన్ సంస్థ ప్రతినిధి ఎన్ ఫోల్డ్ కో ఫౌండర్, గైనకాలజిస్ట్ డా. సహైభ్యా సల్దానా, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమీక్షా సమావేశంలో జరిగిన విషయాలను అనంతరం సచివాలయంలోని నాల్గవ బ్లాక్ లో ఉన్న ప్రచార విభాగంలో మంత్రులు సుచరిత, తానేటి వనిత, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మలు మీడియాకు వివరించారు.

Related posts

స్వామిజీల‌ను కొనుగోళ్ళ ప‌ర్వంలోకి దింప‌డం సిగ్గు చేటు

Bhavani

క్రిస్మస్ కు సంబంధించి ఎన్నో విశేషాలు ఉన్నాయి తెలుసా?

Satyam NEWS

పుంగనూరు ఘటనకు మంత్రి పెద్దిరెడ్డే కారణం

Satyam NEWS

Leave a Comment