39.2 C
Hyderabad
April 25, 2024 17: 48 PM
Slider ప్రకాశం

అన్యాక్రాంతమైతున్న ప్రభుత్వ భూములు

#darsi

ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ పరిధిలోని దర్శి గ్రామ సర్వేనెంబర్.340/5 లో 94 సెంట్లు ప్రభుత్వ భూమిలో ఉండగా దానిలో రెండు గంటలకు మాత్రమే ప్రభుత్వ భూమి అని రెవెన్యూ అధికారులు బోర్డు ఏర్పాటు చేయటం ఏర్పాటు చేయడం జరిగింది. మండల రెవెన్యూ అధికారులు మొత్తముగా ఉన్న 94 సెంట్ల స్థలంలో కంచవేసి అక్కడ ప్రభుత్వ భూమి అని బోర్డు ఏర్పాటు చేయాలని నవ్యాంధ్ర మాదిగ చర్మకారులు డప్పు కళాకారుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు కవలకుంట్ల గోవింద ప్రసాద్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఆదివారం అన్యాక్రాంతమైన స్థలాలను పరిశీలించి ఆ స్థలా లో ప్రభుత్వ బోర్డులను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. అలాగే దర్శి గ్రామ సర్వే నెంబరు 246. 247లో కూడా ప్రభుత్వ బోర్డు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వపు స్వాధీనం చేసుకొని పక్షంలో ఇంటి స్థలాలు లేనటువంటి ఎస్సీ. ఎస్టి. బీసీ. మైనార్టీ ప్రజలతో నివాసాలు ఏర్పాటు చేసుకుంటామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

దేశ ప్రతిష్టను ఉన్నత శిఖరాలకు చేర్చిన ధ్యాన్ చంద్

Satyam NEWS

జగన్ మనసులోని మాట బొత్సా నోటి వెంట….

Satyam NEWS

అనాథబాల

Satyam NEWS

Leave a Comment