27.7 C
Hyderabad
April 20, 2024 01: 52 AM
Slider రంగారెడ్డి

పోచారం మున్సిపాలిటీ లో యథేచ్ఛగా సర్కారు భూములు కబ్జా…

#landgrabbing

భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. ఖాళీ జాగా కన్పిస్తే పాగా వేసేస్తున్నారు. అధికారులకు ఆమ్యామ్యాలు ఎరజూపి రికార్డులు తారుమారు చేస్తున్నారు. అధికారుల ఆజ్యం కబ్జాదారుల భూదాహం వెరసి కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి స్వాహా అవుతోందని స్థానిక సీనియర్ కాంగ్రెస్ నాయకులు సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం, పోచారం మున్సిపాలిటీ పరిధిలోని  అన్నోజిగూడ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిని కాపాడలేని పరిస్థితిలో రెవెన్యూ యంత్రాగం ఉందని చెప్పడానికి స్థానిక ప్రాంతంలో కబ్జాకు గురైన ప్రాంతలే నిలువుటద్దంగా కనిపిస్తున్నాయని అన్నారు. అడ్డూ అదుపూలేకుండా ఆక్రమణదారులు కబ్జాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఘట్కేసర్ మండలం రెవెన్యూ లో ఉన్న సర్వే నంబర్ 3/1లో గల ప్రభుత్వ భూములకు రక్షణ కరువైందని, ప్రభుత్వ భూమి కావడంతో ఈ సర్వే నంబర్లో వేర్వేరు సమయాల్లో వేర్వేరు అవసరాల నిమిత్తం కేటాయింపులు చేస్తూ వచ్చిన ప్రభుత్వ హద్దులతో ఆయా వర్గాలకు భూమిని ఇవ్వకపోవడంతో కబ్జాలు పెరిగిపోయాయన్నారు. ప్రభుత్వ స్థలాలను ప్రైవేట్ సర్వే నంబర్ల పేరుతో ఆక్రమణదారులు అమ్ముకుంటు, సొమ్ము చేసుకుంటున్నారని వాపోయారు. పోచారం గ్రామంలోని సర్వే నెం. 10.11 %్న% 12/భాగంలో అన్నోజిగూడ గ్రామం వద్ద ఉన్న సర్వే నెం.3/1 ప్రభుత్వ భూమి నిర్మాణ ప్రాంతానికి ఆనుకుని ఉన్నందున, సర్వే నెం. 3లోని ప్రభుత్వ భూమిని అక్రమంగా ఆక్రమించుకున్నారని తెలిపారు. 3/1 సర్వే నంబర్ లో అయిదెకరాల స్థలంలో దాదాపు కబ్జాకు లోనవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారని, ఇందునిమిత్తమే గతంలో జిల్లా కలెక్టర్ కి వినతిపత్రాన్ని అందించామని తెలిపారు. ఇప్పటికైనా ఉ న్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూములను అక్రమార్కులు నుండి కాపాడాలని అన్నారు.

జి.శ్రీనివాసరావు, సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

పోలీసులు ప్రజల పట్ల నిబద్ధతతో పని చేయాలి

Satyam NEWS

జైల్లో మగ్గుతున్న ఖైదీలకు బైయిల్ మంజూరు చేయండి

Satyam NEWS

పటిష్ట భద్రత కోసం సరిహద్దు జిల్లాల ఎస్ పిల సమావేశం

Bhavani

Leave a Comment