39.2 C
Hyderabad
March 29, 2024 16: 53 PM
Slider నల్గొండ

అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసి ఇవ్వాలి

#CPINalgonda

ఫణిగిరి సీతారామ స్వామి గట్టు వద్ద సగం నిర్మించిన ఇళ్లను డబల్ బెడ్ రూమ్ ఇళ్ళుగా మార్చి పేదలకు ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేసింది. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ సిపిఎం ముఖ్య నాయకుల విస్తృత సమావేశం నాగారపు పాండు అధ్యక్షతన మంగళవారం జరిగింది.

ఈ సమావేశానికి సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సోషల్ మీడియా జిల్లా కన్వీనర్ ఆకుల శ్రీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని ఫణిగిరి  రామస్వామి గట్టు వద్ద కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ఇళ్ళు అసంపూర్తిగా మిగిలిపోయాయని అన్నారు.

వాటిని డబుల్ బెడ్ బెడ్ రూమ్ ఇళ్ళుగా మార్చి అర్హులైన వారికి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. అసంపూర్తిగా ఉండటంవల్ల అవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

రైతాంగానికి ఋణమాఫీ సక్రమంగా అమలు కావడం లేదని, రైతులందరికీ ఏకకాలంలో లక్ష రూపాయలు ఋణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శులు కందగట్ల అనంత ప్రకాష్, షేక్ యాకోబు, పాండు నాయక్, వట్టేపు సైదులు, నాగారపు పాండు, సోషల్ మీడియా బాద్యులు జక్కుల వెంకటేశ్వర్లు, ఆర్లపూడి వీరభద్రం, పోషబోయిన హుస్సేన్, సట్టు శ్రీను, పల్లె వెంకట్ రెడ్డి, రోషపతి, దుగ్గి బ్రహ్మం, వీరమల్లు, రేపాకుల మురళి, కాసాని వీరస్వామి, శీలం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.  

Related posts

అంగరంగ వైభవంగా గణనాథుడు నిమజ్జన వేడుకలు

Satyam NEWS

శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌజ్ లో రెండో సారి మంటలు

Satyam NEWS

సామాన్య ప్రజల పైనే మావోయిస్టుల దాడులు

Satyam NEWS

Leave a Comment