28.7 C
Hyderabad
April 20, 2024 08: 10 AM
Slider వరంగల్

రైతు వ్యతిరేక చట్టాలను కేంద్రం రద్దు చేయాలి

#AgricultureAct

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని సిపిఎం జిల్లా నాయకులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్య లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మండల కేంద్రంలో గురువారం నాడు స్థానిక రైల్వే స్టేషన్ ముందు సిపిఎం, రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ ఈ చట్టాల వల్ల రైతాంగానికే కాకుండా దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుందని అన్నారు.

డిల్లీలో రైతులు చేపట్టిన ఆందోళన, పోరాట కార్యక్రమాలలో వందలాది మంది చనిపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు పామనుగుల్ల అచ్చాలు, మండల నాయకులు శీలా రాజయ్య, కత్తుల లింగస్వామి, రుద్రారపు పెద్దులు, రైతు సంఘం నాయకులు ఐతరాజు నర్సింహ,

జోగు లక్ష్మయ్య, మహిళా సంఘం నాయకురాలు జిట్ట సరోజ, మేడి సుగుణమ్మ, రమాదేవి, ఇందిరా, వివిధ ప్రజా సంఘాల నాయకులు జిట్ట  స్వామి, దుర్గేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉప్పల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ విభాగం జలమండలికి అప్పగింత

Satyam NEWS

మట్టపల్లి ఆర్యవైశ్య నిత్యాన్నదాన సత్రానికి జనరేటర్ బహుకరణ

Satyam NEWS

కోహ్లీ రెస్టారెంట్లో స్వలింగ సంపర్కులకు నో ఎంట్రీపై వివాదం

Sub Editor

Leave a Comment