31.7 C
Hyderabad
April 19, 2024 00: 47 AM
Slider ఆదిలాబాద్

నష్టపోయిన రైతులకు ఎకరాకు 30 వేలు ఇవ్వాలి

#TDPAdilabad

భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని ఎకరానికి 30 వేలు నష్టపరిహారం ఇవ్వాలని ఆదిలాబాద్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుళ్ళపల్లి ఆనంద్ డిమాండ్ చేశారు.

తడిసిన పత్తిని తేమ శాతం విషయంలో అదనపు రాయితీలు ఇవ్వాలని, 12 శాతం వరకూ తేమను అంగీకరించాలని ఆయన అన్నారు. మద్దతు ధర ఇచ్చి రైతులను అన్నివిధాల ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

ఈరోజు ఆదిలాబాద్ మండలం చాంద్ T  గ్రామంలోని పత్తి రైతు పొలాన్ని ఆయన సందర్శించి రైతు బాధలను తెలుసుకున్నారు. 10 ఎకరాల లో పత్తి పంట వేసి పూర్తిగా నష్టం వచ్చిందని పత్తి కాయలు గులాబీ పురుగు తో పాడై పంట దిగుబడి లేదని ఆయన అన్నారు.

పెట్టుబడి రాక రైతులు అప్పుల్లో కూరుకుపోయారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి రాజేశ్వర్ అధికార ప్రతినిధులు మీర్ సాదిక్ ఆలీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు భూమయ్య, తెలుగు మహిళ రాష్ట్ర కార్యదర్శి జ్ఞాన సుధా, పార్లమెంట్ ఎస్టి  సెల్ అధ్యక్షులు దౌలత్ కుమార్, పట్టణ అధ్యక్షుడు ఎండి రఫిక్ పతివ్రత ప్రభాకర్ రాజన్న రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

విద్య‌ల‌న‌గ‌రంలో అవుట్ రీచ్ బ్యూరో ఆధ్వ‌ర్యంలో ఘ‌నంగా అమృతోత్స‌వం…!

Satyam NEWS

చిన్న తిరుపతిలో వైభవంగా వేంకటేశ్వర కళ్యాణం

Satyam NEWS

క‌రోనా వ్యాధిని అరిక‌ట్టేందుకు అన్నివిధాలా స‌హ‌కారం

Satyam NEWS

Leave a Comment