36.2 C
Hyderabad
April 25, 2024 21: 32 PM
Slider మహబూబ్ నగర్

జర్నలిస్ట్ మనోజ్ కుమార్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి

#Kollapur Journalists

ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉండాలని కొల్లాపూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా జర్నలిస్ట్ మనోజ్ కుమార్ యాదవ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం  ప్రెస్ క్లబ్ సభ్యులు మాట్లాడారు. కష్టాలను నష్టాలను భరిస్తూ  ప్రాణాలను పణంగా పెట్టి కరోనా  మహమ్మారి సంబంధించిన వార్తలను సేకరిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వాలు అండగా ఉండాలన్నారు.

వైద్య, పోలీస్,మున్సిపల్  శాఖల వారికి  ప్రభుత్వం ఏ విధంగా భరిస్తుందో అదే మాదిరిగా జర్నలిస్టులకు కూడా ప్రభుత్వం అండగా ఉండాలని తెలిపారు. ఆదివారం టీవీ5 క్రైమ్ రిపోర్టర్ మనోజ్ కుమార్ యాదవ్ కరోనా వైరస్ తో  ప్రాణాలు వదిలారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర జర్నలిస్టులు జాగ్రత్తలు పాటించాలని వారు తెలిపారు.

ముఖ్యంగా మనోజ్ కుమార్ యాదవ్ కుటుంబానికి ప్రభుత్వం 50లక్షల ఎక్స్గ్రేషియా అందజేయాలన్నారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మెన్  అల్లం నారాయణ బాధ్యత వహించి  ప్రభుత్వం ద్వారా మంజూరయ్యే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు.

నిజాలను నిర్భయంగా వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులు  ధైర్యంగా ఉండి,జాగ్రత్తలు తీసుకుంటూ న్యూస్ సేకరించాలని వ్యక్తిగతంగా రిపోర్టర్ అవుట రాజశేఖర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు చేపల గోపి, ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఎం డి.ముస్తాక్, బాలకృష్ణ,కె.గోవింద్, అవుట రాజశేఖర్,కురుమయ్య పాల్గొన్నారు.

ఇంకా సిపి నాయుడు,పుల్లయ్య,రఘు నాయుడు, నరేందర్, రాజేష్ గౌడ్,అఖిలపక్ష నాయకులు బిజెపి మండల అధ్యక్షుడు సాయి కృష్ణ గౌడ్,సిపిఎం శివ వర్మ,అడ్వకేట్ కురుమయ్య తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన బ్రహ్మానందం

Satyam NEWS

మత్స్యకారుల అభివృద్ధి కోసమే చేప పిల్లల పంపిణీ.. మంత్రి పువ్వాడ

Sub Editor

అట్టడుగు వర్గాల శ్రమను దోచుకుంటున్న ప్రభుత్వం

Bhavani

Leave a Comment