బిచ్కుంద, జుక్కల్ మండలాల్లో ఉపాధి హామీ క్షేత్ర సహాయకులు గా విధులు నిర్వర్తిస్తున్న ఫీల్డ్ స్టెంట్లు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ నిరవధిక సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. కానీ ఈ విషయం ప్రభుత్వం గుర్తించకుండా జిల్లా కలెక్టర్ అందరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం మనసు మార్చి తమకు న్యాయం చేయాలంటూ వారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గణపతి మాట్లాడుతూ 477జీవోను రద్దు చేసి పెరిగిన ధరలకనుగుణంగా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు చాలీ చాలని వేతనాలతో తాము ఇబ్బందులు పడుతున్నామని తమకు నెలకు రూ.21000 జీతం ప్రకటించాలన్నారు.
తమను ప్రభుత్వోద్యోగులుగా గుర్తించి హెచ్చార్సి, ప్రమోషన్స్ బదిలీలు హెల్త్ కార్డులను జారీ చేయాలన్నారు. విధి నిర్వహణలో ప్రమాదం లో మరణిస్తే పది లక్షల రూపాయల పరిహారం ప్రకటించి తమను ఆదుకోవాలని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ క్షేత్ర సహాయకుల సంఘం ఉపాధ్యక్షులు బాలయ్య విరేశం, రామారావు, సాయిలు తది తరులు పాల్గొన్నారు.