39.2 C
Hyderabad
March 29, 2024 14: 03 PM
Slider నల్గొండ

కార్మికుల సమస్యలను విస్మరిస్తే ప్రభుత్వాల మనుగడ ఉండదు

AITUCHujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సివిల్ సప్లై హమాలి కార్మికుల ఎనిమిదవ రోజున సమ్మెలో భాగంగా వంటావార్పు కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వాలకు కార్మికులు తమ నిరసన వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో AITUC జిల్లా అధ్యక్షుడు జడ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ గత ఎనిమిది రోజులుగా సివిల్ సప్లై హమాలీ కార్మికులు ఒప్పందం ప్రకారం హమాలీలకు, హమాలి రేట్ల ఒప్పంద జీవోను విడుదల చేయాలని , నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు కూడాలేదని అన్నారు. ప్రజలు ప్రభుత్వాలని ఎన్నుకున్నది ప్రజా సమస్యలు పరిష్కరిస్తారని,కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లకు, పారిశ్రామికవేత్తలకు, బడా కార్పొరేట్ వ్యక్తులకు కొమ్ము కాస్తూ, కార్మికులను అణగత్రొక్కే ప్రయత్నం జరుగుతోందని అన్నారు.

తక్షణమే కార్మికుల సమస్యలను పరిష్కరించి జీవో విడుదల చేయాలని, లేని పక్షంలో తమ సమ్మెను ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో AITUC కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

భూమిలో నత్రజని స్థిరీకరణకు జీలుగ విత్తనాలు వేయండి

Satyam NEWS

బీజేపీ పతనం ప్రారంభం

Bhavani

పునరావాసం కల్పించాలని కొండాయి గ్రామస్తుల వినతి

Satyam NEWS

Leave a Comment