28.7 C
Hyderabad
April 25, 2024 04: 34 AM
Slider విజయనగరం

మహారాజా కళాశాల ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడపాలి….!

#maharajacollege

రాష్ట్రంలో 6 ఎయిడెడ్ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ జీఒ ఎంఎస్ నెంబ‌ర్ 42 ను ఈ నెల 10  హైయ్య‌ర్ ఎడ్యుకేష‌న్ డిపార్ట్ మెంటు సర్క్యులర్ విడుదల చేసింది. ఇందులో మహారాజా కళాశాల లేకపోవడం అన్యామని తక్షణమే మహారాజా కళాశాల ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడపాలి అని విజయనగరం న‌గ‌ర పౌర సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డి శంకరరావు డిమాండ్ చేశారు.

మచిలీపట్నం బీబీ కళాశాలను కూడా ఎండోమెంట్ నిర్వహిస్తుంది. దాన్ని స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం. ఎంఆర్ కళాశాల ను ఎందుకు స్వాధీనం చేసుకోలేదో ప్ర‌భుత్వ‌మే సమాధానం చెప్పాల‌ని  శంకరరావు ప్రశ్నించారు. ఎంఆర్ కళాశాల లో మంచి లైబ్రరీ.టేబుళ్ల‌తో కూడిన ప‌రిక‌రాలు,ఎక్విప్ మెంట్   ఉన్నాయని . అలాగే తక్కువ పీజులుతో ఎక్కువ మంది చదువుతున్న కాలేజీ అని అందువ‌ల‌న‌ ఎండోమెంట్ నుండి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నడపాలి అని ఆయన అన్నారు.

ఇక ఎంఆర్ కళాశాల లో అన్ ఎయిడెడ్ స్టాఫ్ వేతనాలు.. నాన్ టీచింగ్ స్టాఫ్ జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని…. కావున వెంటే వారి వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం చైర్మెన్ అశోక్ గజపతి రాజు, కలెక్ట్ ర్ కు, వినతి పత్రాన్ని సమర్పి స్తామని అప్పటికి న్యాయం జరగక పోతే పోరాటం చేస్తామని హెచ్చ‌రించారు. .

ఈ మేర‌కు న‌గ‌రంలోని లావుబాల గంగాధ‌ర్ భ‌వ‌న్ లో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో శంకరావు తో పాటు సంఘం ఉపాధ్యక్షుడు సన్ని బాబు. సహాయ కార్యదర్శి ఆస్లామ్ ఖాన్ పాల్గొన్నారు.

Related posts

నిమ్మగడ్డను తొలగించడం జగన్ అధికార దాహానికి నిదర్శనం

Satyam NEWS

త్వరలో తండ్రి కాబోతున్న భల్లాల దేవుడు

Satyam NEWS

మోడీ మాటలే కమలం విజయ రహస్యం

Satyam NEWS

Leave a Comment