39.2 C
Hyderabad
March 29, 2024 17: 12 PM
Slider శ్రీకాకుళం

అధికారి చేసిన పనితో సమగ్ర శిక్ష బోధకులకు అన్యాయం

#ProjectDirector

శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు లో 20 మంది అధ్యాపకులు పని చేసేవారు.

విద్యార్థులకు  పాఠాలను బోధించడం, రాత్రి 24 గంటలు  కళాశాలలో ఉండి విద్యార్థులకు అదనపు తరగతులు బోధించడం, ప్రాక్టికల్స్ నిర్వహించడం , విద్యార్థులకు పరీక్షలు పెట్టి వారి మేధస్సును పెంచడం, ప్రభుత్వం ప్రధాన పరీక్షల్లో పరిశీలన పర్యవేక్షించడం, విద్యార్థుల యొక్క చివరి పరీక్షల్లో మూల్యాంకనం చేయడం, ఎన్నికలు వీధులను, నిర్వహించడం, బడి మానేసిన విద్యార్థులను తిరిగి బడిలో చేర్పించడం అనేక కార్యక్రమాలను  నిర్వహించారు.

కానీ ఈ యేడాది వీరిని విధుల నుంచి అర్ధాంతరంగా తొలగించారు. ఈ అధ్యాపకులకు ఉద్యోగ నియామక పత్రం లో   లోపం ఉండడంతో ఈ ఏడాది ఉద్యోగంలో కొనసాగించడం లేదని ఉన్నతాధికారులు అంటున్నారు. అదే నిజమైతే దీనికి కారకుడు  శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష పాత ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాసరావు అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రధాన కార్యదర్శి బి. కాంతారావు(నాని) తెలిపారు.

తక్షణమే ఆయనపై చర్యలు తీసుకుని, ఉపాధ్యాయులను ఉద్యోగాలలోకి తీసుకోవాలని ఆయన కోరారు. టీచర్లకు అన్యాయం చేయవద్దని శ్రీకాకుళం జిల్లా  సమగ్ర శిక్ష అదనపు కోఆర్డినేటర్ పి. రమణ కోరారు.

Related posts

ఎవరి పైకి వదిలారో తెలియదు కానీ సరిగ్గా గుచ్చుకుంది

Satyam NEWS

‘రైటర్ పద్మభూషణ్’ ఫిబ్రవరి 3న విడుదల

Bhavani

శాస్త్రీయ విద్యా విధానం కోసం విద్యార్థులు పోరాడాలి

Bhavani

Leave a Comment