27.7 C
Hyderabad
April 25, 2024 10: 51 AM
Slider కృష్ణ

ఎయిడెడ్ కాలేజీ విద్యార్ధుల ఆందోళనకు టీడీపీ మద్దతు

#rajendraprasad

ఎయిడెడ్ కాలేజీ ని మూసివేయవద్దని ఆందోళన చేసి అరెస్టు అయిన విద్యార్ధులను మాజీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ విడిపించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులోని ఏ.జి & ఏస్.జి కళాశాల ప్రయివేటీకరణను నిరసిస్తూ విద్యార్ధులు ఆందోళన చేయడంతో పోలీసులు అరెస్టు చేశారు. ఏ.జి & ఏస్.జి విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న శాసనమండలి మాజీ సభ్యులు వై వి బి రాజేంద్ర ప్రసాద్ అక్కడకు చేరుకుని పోలీసులతోనూ, కాలేజీ ప్రిన్సిపల్ తోనూ చర్చించారు.

విద్యార్థులపై ప్రిన్సిపల్ ఇచ్చిన కంప్లైంట్ ఉపసంహరింపజేసి అరెస్టయిన విద్యార్థులను విడుదల చేయించారు. అనంతరం రాజేంద్ర ప్రసాద్  మాట్లాడుతూ ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీల పై ప్రభుత్వం తీసుకొచ్చిన జి ఓ లను వెంటనే ఉపసంహరించు కావాలని ప్రభుత్వ విధానాల వల్ల బడుగు బలహీన వర్గాల విద్యార్థులు నష్టపోతున్నారనీ అన్నారు. ఎయిడెడ్ కాలేజీల స్వాధీనానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న విద్యార్థులకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. విద్యార్థులతో రాజేంద్రప్రసాద్  మాట్లాడుతూ ఉద్యమం శాంతి యుతంగా గా నిర్వహించాలని తను కూడా విద్యార్థి ఉద్యమాలతోనే ఈ స్థాయికి వచ్చానని ఆవేశాలకు పోయి కాలేజీ ఆస్తులకు నష్టం కలిగించే వద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ అజ్మతుల్లా,బూరెల నరేష్, జంపాన తేజా సిగతాపు ప్రసాద్ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Related posts

యూపీలో సరయూ నహర్ జాతీయ ప్రాజెక్టు ప్రారంభోత్సవం

Sub Editor

అమెరికాలో తెలుగువారు క్షేమంగానే ఉన్నారు

Satyam NEWS

హైదరాబాద్ పరిసరాల్లో 50 వేల మందికి కరోనా టెస్టు

Satyam NEWS

Leave a Comment