30.7 C
Hyderabad
April 24, 2024 02: 54 AM
Slider ముఖ్యంశాలు

కేంద్ర ప్రభుత్వం తక్షణం నాలుగు లేబర్ కోడ్ లు ఉపసంహరించుకోవాలి

#labourcode

కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లు జూలై ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని చూస్తోందని తక్షణమే దానిని ఉపసంహరించుకోవాలని,కార్మికుల హక్కులకి సంకెళ్ళ లాంటి చట్టాన్ని రద్దు చేయాలని సి ఐ టి యు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని భవన నిర్మాణ కార్మికుల సమావేశంలో పాల్గొన్న శీతల రోషపతి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్తున్న సందర్భంగా కార్మిక సంఘాలు, నాయకులు,కార్మికులు అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా రోషపతి మాట్లాడుతూ ఈనెల 30న,ఢిల్లీలో బి టి ఆర్ భవన్లో ఆల్ ఇండియా సి ఐ టి యు క్లస్టర్ కమిటీ సమావేశంలో పాల్గొనటానికి వెళ్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్ లను ప్రతిఘటించాలని, పనిగంటలు పెంచడంతోపాటు కార్మికుల జీవితాలు దుర్భరం అవుతాయని, కార్మికుల సామాజిక భద్రత ఉండదని అందుకే ఈ లేబర్ కోడ్ లను రద్దు చేయాలని కోరారు.

భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క్ సోమయ్య గౌడ్ మాట్లాడుతూ సంక్షేమ బోర్డు నుండి ఇన్సూరెన్స్ కల్పించాలని,అడ్డాల వద్ద కార్మికులకు మౌలిక వసతులు కల్పించాలని,హెల్పర్ బోర్డు నిధులు ప్రక్కదోవ పట్టకుండా ప్రభుత్వం చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శిల్పకళ బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష్య, కార్యదర్శులు,కార్మికులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్  హుజూర్ నగర్

Related posts

వేణుగానాలంకారంలో శ్రీరామచంద్రమూర్తి చిద్విలాసం..

Satyam NEWS

అగ్రి మార్కెటింగ్‌ ఇంటెలిజెన్స్‌పై సీఎం ఆరా

Satyam NEWS

మెట్రో టీవీ క్యాలెండర్ ఆవిష్కరించిన నంద్యాల ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment